Viral Video: మనుషులకు ఏ మాత్రం తీసిపోమంటున్న కప్పలు.. తాము చూస్తుండగా సెల్ ఫోన్ తీస్తున్న వ్యక్తిపై దాడి..

|

May 06, 2022 | 10:16 AM

Viral Video: ఇటీవల సోషల్‌ మీడియాలో(Social Media) ప్రతి చిన్న చిన్న విషయాలకు చెందిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.  అది మనుషులకు సంబంధించినది అయినా.. పశుపక్ష్యాదులకు..

Viral Video: మనుషులకు ఏ మాత్రం తీసిపోమంటున్న కప్పలు.. తాము చూస్తుండగా సెల్ ఫోన్ తీస్తున్న వ్యక్తిపై దాడి..
Viral Video
Follow us on

Viral Video: ఇటీవల సోషల్‌ మీడియాలో(Social Media) ప్రతి చిన్న చిన్న విషయాలకు చెందిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.  అది మనుషులకు సంబంధించినది అయినా.. పశుపక్ష్యాదులకు చెందినదైనా.. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వైరల్ అవుతున్నాయి. దీంతో మనిషి ఎక్కడ ఏమి జరిగినా వాటిని చూడగలుగుతున్నాడు.. ప్రకృతిలోని ఎన్నో అద్భుతాలను ఆస్వాదిస్తున్నాడు. కొన్ని వీడియోలు నేటి పరిస్థితికి అద్దం పట్టేలా ఉంటూనే.. ఫన్నీగా ఉంటున్నాయి. తాజాగా కప్పలకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే కప్పలు.. చెరువులు, కుంటలు పంటకాలువల దగ్గర నివసిస్తుంటాయి. అలాంటి కప్పలు కూడా ఇప్పుడు తాను నేటి మనిషికి ఏ విధంగా తీసిపోని అనిపించేలా సెల్ ని చూస్తూ సందడి చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు అరే.. కప్పలు ఇంత డెవలప్ అయ్యాయా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చిన్న నీటి కుంటలాంటి ప్రదేశంలో చక్కగా పచ్చిక మొలకెత్తి ఉంది. అక్కడ కొన్ని కప్పలు ఉన్నాయి. ఎవరో వ్యక్తి ఆ కప్పల ముందు తన సెల్‌ఫోన్‌లో ఏదో చిత్రాన్ని ఆన్‌ చేసి ఆ కప్పల ముందు పెట్టాడు. ఆ వీడియో కప్పలకు నచ్చినట్లు ఉంది. చక్కగా లైన్ లో కూర్చుని బుద్ధిగా ఆ సెల్ లో వచ్చే సీన్స్ ను చూస్తున్నాయి.  ఇంతలో ఆ వ్యక్తి అక్కడినుంచి ఆ ఫోన్‌ తీసెయ్యబోయాడు. అంతే వెంటనే అక్కడ లైన్ లో ఉన్న ఓ కప్పు అతడిని అడ్డుకుంది.  పెద్దగా అరుస్తూ అతని చేతిని కరిచేంతపని చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు మనిషి మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్ కి బానిస.. ప్రకృతిలోని జీవులు కూడా బానిసలుగా మారిపోతున్నాయంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియోలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

అత్తారింటికి వెళ్తున్న సోదరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సోదరుడు.. మనసులు కదిలిస్తున్న వీడియో

Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు.. పులకించిన భక్తజనం.. కరోనా ఆంక్షల నడుమ అనుమతి