
పులి వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఉన్నది ఎలాంటి జీవి అయినా అవి బెదరవు. జంతువుల్లో పెద్ద పులి రారాజు. అటువంటి పెద్ద పులి ఓ నాగుపాము చూసి దడుచుకుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదో ఫారెస్ట్ ఏరియాలా కనిపిస్తుంది. బాగా వాన కురిసి వెలడవంతో.. ఆ ప్రాంతంలో నీరు నిలిచింది. ఓ నాగుపాము ఆ నీటిని దాటుతూ కనిపించింది. ఇంతలో ఓ పెద్ద పులి అటుగా వచ్చింది. తన ముందున్న పామును చూసి, పులి అకస్మాత్తుగా ఆగిపోయింది. పాము తల తిప్పి పులి వైపు చూడగానే, ఆ భయంకరమైన వేటగాడి ధైర్యం అంతా పోయింది. పులి రెండు అడుగులు వెనక్కి తగ్గడం ప్రారంభించింది.
‘TheBigCatsEmpire’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక పెద్ద పులి కోబ్రాను చూసి భయంతో వణుకుతున్నట్లు కనిపిస్తుంది. అడవి మధ్యలో నీటి ప్రవాహం సన్నని దారంలా ప్రవహిస్తుంది. ఒక పాము ఆ నీటిగుండా రోడ్డు దాటుతుంది. అదే రోడ్డు వెంబడి పులి ఒక పులి నడుస్తోంది. పామును చూడగానే పులి ఆగిపోయింది. పులి రావడం గమనించిన కోబ్రా తల తిప్పి దాని వైపు చూసింది. ఇది చూసిన పులి భయపడిపోయింది. రెండు అడుగులు వెనక్కి తగ్గడం ప్రారంభించింది. ఈ వీడియోను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కానీ నాగుపాము కాటు వేస్తే పెద్దపులి చనిపోయే అవకాశం ఉంది. అది విడుదల చేసే విషం పరిమాణంపై పులి బతుకు ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..