Viral Video: ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు పులులు, సింహాలు, పాములు, మొసళ్లు తదితర జంతువులకు సంబంధించిన వీడియోలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరి కొన్ని ఫన్నిగా ఉంటాయి. ఇక తాజాగా ఓ రిక్షాకు సంబంధించిన ఓ వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడిన ఈ క్లిప్ క్రేజీ వైరల్‌గా మారింది. ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. దీనిని చూసిన కొందరు దయ్యం అని సంభోదిస్తున్నారు.
తుఫాను సమయంలో రద్దీగా ఉండే రహదారినిపై ఓ రిక్షా నిలిపి ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ రిక్షా ముందుకు వెళ్లడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డు పక్కన ఉన్న ఈ వీడియో కొన్ని సెకన్ల తర్వాత ఒక రిక్షా రోడ్డుపైకి వెళ్లడం చూడవచ్చు. ఆ రిక్షాను ఎవ్వరు కూడా నడపడం లేదు. దానంతట అదే ముందుకు కదలడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Hey @elonmusk when did @Tesla make this autonomous Rickshaw?
It was spotted in Bangladesh?
I also want one?#elonmusk #tesla pic.twitter.com/AavWfN7tm7— Arko Chakraborty (@arko_c16) June 1, 2022
రిక్షా రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపైకి వచ్చి మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 760k పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా పోస్టు చేయబడింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి