Golden Tortoise: బంగారు వర్ణంలో కనువిందు చేస్తోన్న ఎగిరే తాబేళ్లు..పూర్తి శాకాహారులు ఈ జీవులు.. స్పెషాలిటీ ఏమిటంటే

|

Apr 13, 2022 | 7:13 PM

Golden Tortoise: ప్రకృతిని మనం పరిశీలించాలే కానీ.. అనేక అద్భుతాలు కనులకు విందు చేస్తాయి. అనేక జీవులు.. వాటిల్లో అనేక రకాలు కనిపిస్తాయి. ఉభయచర జీవుల్లో ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉన్న తాబేళ్లలో..

Golden Tortoise: బంగారు వర్ణంలో కనువిందు చేస్తోన్న ఎగిరే తాబేళ్లు..పూర్తి శాకాహారులు ఈ జీవులు.. స్పెషాలిటీ ఏమిటంటే
Golden Tortoise
Follow us on

Golden Tortoise: ప్రకృతిని మనం పరిశీలించాలే కానీ.. అనేక అద్భుతాలు కనులకు విందు చేస్తాయి. అనేక జీవులు.. వాటిల్లో అనేక రకాలు కనిపిస్తాయి. ఉభయచర జీవుల్లో ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉన్న తాబేళ్లలో(Tortoise) కూడా అనేక రకాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే బంగారు వర్ణంలో మిలమిలా మెరుస్తూ..  పక్షుల్లా ఎగురుతున్న బుల్లి బుల్లి తాబేళ్లను చూసిన వారు బహు అరుదనే చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన అనంతరం.. ప్రకృతిలో ఎక్కడ ఏ వింత చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచం మొత్తానికి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమేజింగ్‌ ప్లానెట్(AmazingPlanet) ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

బంగారు తాబేలు బీటిల్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ జీవులు లీఫ్ బీటిల్ కుటుంబంలో భాగమని.. అమెరికాలో కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన కీటకాల వీడియో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటుంది. షేర్ చేసిన ఈ వీడియోల్లో ఈ తాబేళ్లు అరచేతిలో కదలాడుతూ కనిసిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వీటికి రెక్కలున్నాయి. కదిపితే రివ్వున గాల్లోకి ఎగురుతున్నాయి. బంగారు పూత పూసినట్టుగా ఉన్న వీటి రంగు మాత్రం అరుదుగా కనిపించేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ జీవి ప్రత్యేక ఏమిటంటే..: ఈ జీవులు మొక్కల్ని తినే చిన్న శాఖాహార పురుగులు. అయితే వీటికి ప్రకృతి అరుదైన ప్రత్యేకతలను ఇచ్చింది. బంగారం రంగులో మెరుస్తూ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో… చిన్న తాబేళ్ల లాగా ఇవి కనిపిస్తాయి. అందుకే అందరికీ నచ్చేస్తున్నాయి

బంగారు తాబేలు బీటిల్స్ అంటే ఏమిటి?

మిస్సౌరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రకారం… బంగారు తాబేలు బీటిల్..  ఇతర తాబేలు లాగా, దాదాపుగా వృత్తాకారంగా.  చదునుగా ఉంటుంది. అంతేకాదు ప్రోనోటమ్ షీల్డ్ పూర్తిగా తల పైభాగాన్ని కప్పి ఉంచుతుంది. ఈ జాతి సజీవంగా ఉన్నప్పుడు మెరిసే లోహ బంగారం లేదా నారింజ రంగులో ఉంటుంది. వీటి అందమైన బంగారు రంగు చూసి  వీటిని చంపి దాచుకోవాలని చాలామంది భావిస్తారు. అయితే వీటి బంగారు రంగు శాశ్వతం కాదు. వీటి జీవిత కాలంలో దశలను బట్టీ బంగారు రంగు రావడం, పోవడం జరుగుతుంది. చనిపోయిన అనంతరం వీటి బంగారు వర్ణం పోతుంది. కనుక ఇవి చనిపోయాక మాములుగా కనిపిస్తాయి.

నెట్టింట్లో వీడియోలు:

ఈ జీవికి సంబంధించి చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. తాజాగా ఓ వీడియోని ట్విట్టర్‌లోని @AmazingNature00 అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 11న పోస్ట్ అయిన ఆ వీడియోఈ వీడియోకు సుమారు 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

జీవిత చక్రం: 

యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఈ ప్రత్యేకమైన కీటకాలపై స్పెషల్ ఆర్టికల్ పోస్ట్ చేసింది. ఇది గుడ్డు నుండి  జీవిగా మారేందుకు సుమారు 40 రోజులు అవసరమని పేర్కొంది. ఈ బంగారు తాబేలు బీటిల్ తూర్పు ఉత్తర అమెరికాలో, పశ్చిమాన అయోవా , టెక్సాస్‌లో కనిపిస్తాని పేర్కొంది.

ఈ బంగారు వర్ణపు తాబేలు పురుగులు…  న్యూజెర్సీలో మే లేదా జూన్‌లో కనిపిస్తాయి. చిలకడ దుంపల ఆకుల్ని ఇష్టంగా తింటాయి. గుడ్ల నుంచి జూలైలో కొత్త తాబేళ్లు జన్మించే సమయం.  ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి వెళ్లేవారికి ఈ పురుగులు కనిపిస్తాయి. ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఇవి అలా ఎగురుతూ మెరుస్తూ ఉండటాన్ని చూసి ఆనందిస్తారు అక్కడి ప్రజలు.

Also Read: Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు

Humanity: మానవత్వం పరిమళించిన వేళ… కరోనా కల్లోలంలో టీచర్.. ఫుడ్ డెలివరీ బాయ్ అయిన వైనం.. బైక్ కొనిచ్చిన నెటిజన్లు..