Viral Video: ఒడ్డున తిరిగే రాబందును సింహం ఎలా వేటాడిందంటే..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: అడవికి ‘రాజు’ సింహం అని మనమందరం చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

Viral Video: ఒడ్డున తిరిగే రాబందును సింహం ఎలా వేటాడిందంటే..! వీడియో చూస్తే షాక్ అవుతారు..
Vulture

Updated on: Aug 23, 2021 | 3:12 PM

Viral Video: అడవికి ‘రాజు’ సింహం అని మనమందరం చిన్నప్పటి నుంచీ వింటున్నాం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ దర్బం, డాబు దానిలో కనిపిస్తాయి. సింహం నడక శైలి, గర్జన శైలి, వేటాడే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సింహం గర్జన వింటేనే మిగతా జంతువులకు వెన్నులో వణుకుపుడుతుంది. దాని వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో తెలియజేసే వీడియోలు ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. డిస్కవరీ ఛానల్‌లో కూడా మీరు ఆ వీడియోలు చూడవచ్చు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒడ్డున తిరిగే రాబందును ఈ సింహం ఎలా వేటాడిందో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఈ వీడియోలో అడవిలోని ఓ చెరువు ఒడ్డున అనేక రాబందులు తిరుగుతుండటం మీరు చూడవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా సింహం అక్కడికి వస్తుంది. దానిని చూసి పక్షులన్నీ ఎగిరిపోతాయి. కానీ ఒక రాబందు సింహం బారిన పడుతుంది. ప్రాణాలు కాపాడుకోవడటానికి చివరి వరకు పోరాడుతుంది. కానీ అక్కడున్నది సింహరాజు. దాని పంజా ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. చివరకు రాబందు.. సింహానికి ఆహారం అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్, షేర్స్ చేస్తూ అదరగొడుతున్నారు.

ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌ లైఫ్ అండ్ నేచర్ అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. కొంతమంది మొట్టమొదటి సారిగా సింహం.. రాబందును వేటాడటం చూశామని కామెంట్ చేస్తున్నారు.

AP Weather Report : రానున్న 3 రోజుల్లో ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..! అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు

Young lady agitation: న్యాయం చేయండంటూ ప్రేమికుని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతి

PPF: మీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉపయోగించక నిష్క్రియంగా మారిందా? దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..!