Watch Video: హృదయాన్ని కరిగించే అద్భుతమైన వీడియో.. స్పృహతప్పి పడిపోయిన కుక్కను రక్షించిన దంపతులు.. చూస్తే అభినందించాల్సిందే..

|

Jan 31, 2023 | 8:15 AM

వేగంగా వెళ్లే వాహనాల కింద పడిపోవడం, చిక్కుకోవడం వల్ల ప్రతిరోజూ వందలాది కుక్కలు, జంతువులు రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్నాయి. మరి కొన్ని సందర్భాలలో..

Watch Video: హృదయాన్ని కరిగించే అద్భుతమైన వీడియో.. స్పృహతప్పి పడిపోయిన కుక్కను రక్షించిన దంపతులు.. చూస్తే అభినందించాల్సిందే..
Dog Rescuing Scenes
Follow us on

వేగంగా వెళ్లే వాహనాల కింద పడిపోవడం, చిక్కుకోవడం వల్ల ప్రతిరోజూ వందలాది కుక్కలు, జంతువులు రోడ్డు ప్రమాదంలో గాయపడుతున్నాయి. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు. వాటికి తమ వంతుగా ఎంతో కొంత సహాయపడి వాటి ప్రాణాలను రక్షిస్తుంటారు. అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీద పడిపోయి ఉన్న కుక్కను చూసిన దంపతులు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి దాని ప్రాణాలను కాపాడారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. kartavyasociety అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వైరల్ వీడియోలో ఒక కుక్క రోడ్డు మీద పడిపోయి ఉండడాన్ని మనం చూడవచ్చు. అటుగా వెళ్తున్నవారు దానిని చూస్తున్నారే కానీ పట్టించుకోవడంలేదు. అయితే ఇంతలో అటుగా వచ్చిన దంపతులు దానిని చూసి తమ బండిని ఆపారు. ఇక వారు ఆ కుక్కను తీసుకుని ఆసుపత్రికి వెళ్లడం, దానికి చికిత్స చేయించడం వంటి దృష్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..