మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలోని ట్రెండింగ్, ఫన్నీ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు మనల్ని ఎంతగానో నవ్వించేలా ఉంటాయి. అందుకే వాటిని చూస్తున్నప్పుడు మనం సమయాన్ని కూడా మర్చిపోతుంటాం. మానవ జీవితంలో ఏదో ఒక అంశంతో ముడిపడి ఉండే ఈ ఫన్నీ వీడియోలు ఎన్ని వచ్చినా చూడాలనే ఆసక్తి మాత్రం మనలో తగ్గనే తగ్గదు. అంతగా నచ్చుతాయి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే కొన్ని వీడియోలు. ఇప్పుడు కూడా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు దానికి లైక్ చేయకుండా, మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారంటే.. మీరే ఆలోచించండి ఆ వీడియో నెటిజన్లకు ఎంతగా నచ్చిందనేది.
సుఖసం శర్మ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ ఫన్ని వీడియోలో ముందు టైర్లు లేకపోయినా ఆగకుండా వెళ్తున్న ఒక ఆయిల్ కంటెయినర్ ట్రక్‌ను చూడవచ్చు. టైర్లు లేకపోతే ఆపాలి కానీ అలా పోనియ్యవచ్చా..? అనే ప్రశ్న మీ మదిలో తడుతుంది కదా.. మరి అదే ఈ వీడియో ప్రత్యేకత. అసలు ఆ ట్రక్ డ్రైవర్ అలా ఎలా పోనివ్వగలుగుతున్నాడనే ప్రశ్న నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. కాగా అంతకముందే ఈ ట్రక్ రోడ్డు ప్రమాదానికి గురైందని కూడా మనం గమనించవచ్చు.
నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోను ఇక్కడ చూడండి..
అయితే ఈ వీడియోను ఎక్కడ ఎవరు తీశారో తెలియరాలేదు కానీ నెటిజన్లు మాత్రం బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 41 లక్షల వీక్షణలు వచ్చిన ఈ వీడియోను సుమారు 4 లక్షల 28వేల మంది లైక్ చేశారు. అదే క్రమంలో నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ భారతీయ డ్రైవర్ టాలెంట్’ అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ ‘ భారతదేశంలో మాత్రమే ఇలా సాధ్యమవుతుంది. ఇక ఎక్కడా ఇది సాధ్యం కాదు’ అని రాసుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..