Funny Video: ‘ఇదేం సరదారా బాబోయ్!’.. ఎస్కలేటర్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్న పెంపుడు కుక్క..

చాలా మందికి సహజంగానే నచ్చే జంతువులు ఏవైనా ఉండంటే అది కుక్కలు మాత్రమే. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువుగా చెప్పుకునే కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

Funny Video: ‘ఇదేం సరదారా బాబోయ్!’.. ఎస్కలేటర్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్న పెంపుడు కుక్క..
Dog Video

Updated on: Feb 14, 2023 | 4:22 PM

చాలా మందికి సహజంగానే నచ్చే జంతువులు ఏవైనా ఉండంటే అది కుక్కలు మాత్రమే. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువుగా చెప్పుకునే కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అటువంటి కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక ఈ వీడియోను చూస్తే ఎవరైనా ‘ఇదేం సరదారా బాబోయ్’ అనాల్సిందే. ఎందుకంటే ఆ కుక్క అలా ఎంజాయ్ చేస్తోంది మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్ మీద. ఇంకా ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వేసుకోవడంతో పాటు సరదా సరదా కామెంట్లు కూడా చేస్తున్నారు.

ViralPosts అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క ఎస్కలేటర్ మీద నుంచి రావడాన్ని మనం చూడవచ్చు. అది ఎస్కలేటర్ ద్వారా నేరుగా పైకి వచ్చి.. దాని పక్కనే ఉన్న మెట్ల ద్వారా మళ్లీ కిందకు వెళ్ళడం కూడా గమనించవచ్చు. అయితే అది కిందే ఆగిపోయిందా అంటే లేదు.. తిరిగి ఎస్కలేటర్ ద్వారా పైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నెెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us