పులి రాజుల ఫైటింగ్.. అబ్బో సినిమా రేంజ్‌లో ఉందిలే..!

| Edited By: Pardhasaradhi Peri

Oct 18, 2019 | 4:29 PM

ముందు ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ పులులు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. అంతే ఆ రెండింటికి పాత కోపాలన్నీ గుర్తు వచ్చినట్లు ఉన్నాయి. దీంతో నువ్వా..? నేనా..? ఇప్పుడే చూసుకుందాం అంటూ రణరంగంలోకి దూకాయి. ఒకదాన్ని మరొకటి కసితీరా కొట్టుకున్నాయి. ఇక ఇవి కొట్టుకుంటుంటే మరో పులి మాత్రం వాటికి దూరంగా ఉండి.. ఆ ఫైటింగ్‌ను సినిమా చూసినట్లు చూస్తోంది. ఇదంతా రాంతమ్‌బోర్ అడవిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రవీణ్ కశ్వాన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ […]

పులి రాజుల ఫైటింగ్.. అబ్బో సినిమా రేంజ్‌లో ఉందిలే..!
Follow us on

ముందు ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ పులులు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. అంతే ఆ రెండింటికి పాత కోపాలన్నీ గుర్తు వచ్చినట్లు ఉన్నాయి. దీంతో నువ్వా..? నేనా..? ఇప్పుడే చూసుకుందాం అంటూ రణరంగంలోకి దూకాయి. ఒకదాన్ని మరొకటి కసితీరా కొట్టుకున్నాయి. ఇక ఇవి కొట్టుకుంటుంటే మరో పులి మాత్రం వాటికి దూరంగా ఉండి.. ఆ ఫైటింగ్‌ను సినిమా చూసినట్లు చూస్తోంది. ఇదంతా రాంతమ్‌బోర్ అడవిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రవీణ్ కశ్వాన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. పులుల మధ్య ఫైటింగ్ ఇలానే ఉంటుంది. చాలా భయంకరంగా అవి కొట్టుకున్నాయి. రాంతమ్‌బోర్‌లో రెండు పులి సోదరులు(T 56, T 57) ఇలా ఫైటింగ్ చేసుకున్నాయి. అంటూ కామెంట్ పెట్టాడు.

ఇక ఆ తరువాత ఆ వీడియో వైరల్‌ అవ్వగా.. అందులో ఎవరు గెలిచారంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇక వాటికి స్పందించిన ప్రవీణ్.. ‘‘చాలా మంది యుద్ధ ఫలితం గురించి అడిగారు. అందులో T 57 గెలిచింది. ఏ పులికి పెద్దగా గాయాలు అవ్వలేదు. అక్కడ ఉన్నమరో పులి T 39 కోసం ఈ రెండిటి మధ్య గొడవ జరిగింది. ఆ పులిని కూడా వీడియోలో చూడొచ్చు’’ అని ట్వీట్ చేశాడు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో.. ‘వావ్ సూపర్ ఫైట్’ అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరేమో ‘ఇలానే నేను నా సోదరుడు కొట్టుకుంటూ ఉండేవాళ్లం’ అని స్పందించారు.