
Uttar pradesh: ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన రంజిత్ చౌరాసియా అనే ఓ యువకుడు ఇలాంటి ఓ స్టంట్ చేసి అరెస్ట్ అయ్యాడు. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలు పనంగా పెట్టి రీల్ చేశాడు. ఏకంగా ట్రైన్ కింద పడుకొని వీడియో రికార్డ్ చేశాడు. కుసుంభి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ వస్తుండగా పట్టాలపై పడుకున్నాడు. ఆ ట్రైన్ తనపై నుంచే వెళ్లే వీడియోను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తాను తీసిన వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో మనోడు నిజంగానే ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో కాస్తా వైరల్ అయి పోలీసుల వరకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
ఈ వీడియోపై స్థానిక రైల్వే పోలీసులు స్పందించారు. యువకుడు తన తప్పును ఒప్పుకుని, మళ్లీ ఇలాంటి పని చేయనని చెప్పి క్షమాపణ కోరినట్టు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు తీస్తూ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపామని వారు చెప్పారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంస్ట్ చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
In #UttarPradesh's #Unnao, a young man identified as #RanjeetChaurasiya was arrested after a reel shows him lying on the track as the train passes over him. His family claims the reel was recorded and edited to give an impression that the train is passing over him. GRP has begun… pic.twitter.com/jmQn0aXZjD
— Hate Detector 🔍 (@HateDetectors) April 8, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..