Shocking News: పెళ్లై 10 రోజులే అయ్యింది.. వధువు 8 నెలల గర్భవతి.. విషయం తెలిసి గిర్రున తిరిగిపడ్డ వరుడు..

|

Oct 01, 2021 | 10:10 PM

Shocking News: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోటలోని సరాయ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి జరిగి 10 రోజులు కూడా కాలేదు..

Shocking News: పెళ్లై 10 రోజులే అయ్యింది.. వధువు 8 నెలల గర్భవతి.. విషయం తెలిసి గిర్రున తిరిగిపడ్డ వరుడు..
Marriage
Follow us on

Shocking News: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోటలోని సరాయ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి జరిగి 10 రోజులు కూడా కాలేదు.. వధువేమో 8 నెలల గర్భవతి అయ్యింది. విషయం తెలిసిన వరుడు గిర్రున తిరిగి పడిపోయాడు. ఈ వార్త ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. వధువు, ఆమె కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట ప్రాంతానికి చెందిన యువకుడు పాదరక్షల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో అతనికి వివాహం నిశ్చయం అయ్యింది. పది రోజుల క్రింత ఆ అమ్మాయితో యువకుడికి వివాహం కూడా జరిగింది. అయితే, పైళ్లైన పది రోజుల తరువాత వధువుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించగా.. షాకింగ్ విషయం తెలిసింది. అదే విషయాన్ని యువతిని పెళ్లి చేసుకున్న యువకుడికి చెప్పగా.. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. యువతి 8 నెలల గర్భవతి అని వైద్యులు చల్లగా చెప్పి వెళ్లారు. దాంతో ఆ యువకుడు బిత్తరపోయాడు. పెళ్లై పది రోజులు కూడా కాలేదు.. 8 నెలల గర్భవతి ఏంటి? అంటూ గిర్రున తిరిగి పడ్డాడు.

అయితే, నవ వధువుకి, వరుడికి పెళ్లికి ముందే సంబంధం ఉందని వధువు తల్లిదండ్రులు ఆరోపించగా.. అసలు ఆమెను టచ్ కూడా చేయలేదని వరుడు తేల్చి చెప్పాడు. లక్నోకు చెందిన యువకుడితో, ఆ అమ్మాయికి సంబంధం ఉందని.. ఆ యువకుడి వల్లే యువతి గర్భవతి అయిందిన వరుడు తరఫున వాళ్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని యువతి పట్టుబట్టగా.. ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారని, ఆమెను భయపెట్టి బలవంతంగా తనతో పెళ్లి చేయించారని వరుడు ఆరోపించాడు. ఇలా ఈ విషయంలో వరుడు, వధువు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది.

వధువుకు వైద్య పరీక్ష..
వరుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వధువు గర్భవతి కావడానికి వరుడు కారణమా? మరో వ్యక్తి కారణమా అని తేల్చేందుకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వైద్య పరీక్షల అనంతరం నిజానిజాలేంటి అనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

Also read:

International Coffee Day 2021: కాఫీ పండించే 5 సుందర ప్రదేశాలు..! చూస్తే మైమరచిపోతారు..

Huzurabad By Election: ‘సీఎంనే అంత మాట అంటావా? మరి నువ్వేంటి?’.. ఈటలపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

ఈ చిన్నారి ఇప్పుడు చాలా ఫేమస్.. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా.!