Viral: డబ్బు అవసరమై బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు.. అమౌంట్ చూడగానే మైండ్ బ్లాంక్ అయ్యింది..

|

Sep 06, 2022 | 5:54 PM

అతడొక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్. తనకు నెల జీతం పడిందా.? లేదా.? అని తెలుసుకునేందుకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు.

Viral: డబ్బు అవసరమై బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు.. అమౌంట్ చూడగానే మైండ్ బ్లాంక్ అయ్యింది..
debited from accounts
Follow us on

అతడొక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్. తనకు నెల జీతం పడిందా.? లేదా.? అని తెలుసుకునేందుకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. అంతే! స్క్రీన్‌పై కనిపించిన అమౌంట్ చూడగా ఒక్కసారిగా అతడి కళ్లు చెదిరాయి, మైండ్ బ్లాంక్ అయ్యింది. వేలల్లో కాదు.. లక్షల్లో కాదు.. కోట్లు.. అలా.. ఇలా కాదు.. లక్షల కోట్లు.. అవును అక్షరాల 3 లక్షల 99 వేల కోట్లు(50 బిలియన్ డాలర్లు) అకౌంట్‌లోకి వచ్చిపడ్డాయి. క్షణాల్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో చేరిపోయాడు. దీనితో అతడికి ఒక పక్కన ఆశ్చర్యం కలిగినా.. మరోపక్క మాత్రం భయం వేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే..!

వివరాల్లోకి వెళ్తే.. లూసియానాకు చెందిన డారెన్ అనే వ్యక్తికి డబ్బు అవసరం ఉండి.. తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందా అని ఫోన్ ద్వారా చెక్ చేసుకున్నాడు. ఈలోపు అతడికి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే.. ‘సుమారు 50 బిలియన్ డాలర్లు( 3 లక్షల 99 వేల కోట్లు) అకౌంట్‌లో క్రెడిట్ అయినట్లు’ ఆ మెసేజ్ సారాంశం. అది సరైనదా.? కాదా.? అనేది చెక్ చేసుకునేందుకు బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించాడు. తన ఖాతాలోనే జమ అయినట్లు నిర్ధారించుకున్న డారెన్.. ఒకింత ఆశ్చర్యానికి గురి కావడమే కాదు.. భయపడ్డాడు కూడా. వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ‘అంత డబ్బు తాను ఎవ్వరికీ ఇవ్వలేదని.. అలాగని సంపాదించలేదని’ బ్యాంక్ సిబ్బందికి చెప్పాడు. అంతే! అతడి ఖాతాను మూడు రోజుల పాటు బ్లాక్‌లో పెట్టిన బ్యాంక్.. అనంతరం ఆ అమౌంట్ మొత్తాన్ని డిబేట్ చేసింది. కాగా, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఆ డబ్బు.. సదరు వ్యక్తి క్షణాల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడ్ని చేసేసింది.. చివరికి మళ్లీ సామాన్యుడిగా మార్చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..