ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణీకుడి తత్తరపాటు.. అతడి బ్యాగ్ చెక్ చేయగా.. దెబ్బకు గుండె గుభేల్.!

|

Mar 27, 2024 | 5:31 PM

మరికాసేపట్లో ఢిల్లీ నుంచి అబుదాబీకి వెళ్లే ఫ్లైట్ టేక్ ఆఫ్‌కు సిద్దంగా ఉంది. ప్రయాణీకులంతా కూడా విమానం ఎక్కేందుకు త్వరతగిన అవుట్ గేటు దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ అధికారులు కన్ను.. ఓ ప్రయాణీకుడిపై పడింది. సూటూ.. బూటూ.. టిప్‌టాప్ డ్రెస్.. అయితేనేం అతగాడి తత్తరపాటు.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..

ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణీకుడి తత్తరపాటు.. అతడి బ్యాగ్ చెక్ చేయగా.. దెబ్బకు గుండె గుభేల్.!
Representative Image
Follow us on

మరికాసేపట్లో ఢిల్లీ నుంచి అబుదాబీకి వెళ్లే ఫ్లైట్ టేక్ ఆఫ్‌కు సిద్దంగా ఉంది. ప్రయాణీకులంతా కూడా విమానం ఎక్కేందుకు త్వరతగిన అవుట్ గేటు దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ అధికారులు కన్ను.. ఓ ప్రయాణీకుడిపై పడింది. సూటూ.. బూటూ.. టిప్‌టాప్ డ్రెస్.. అయితేనేం అతగాడి తత్తరపాటు.. అనుమానాస్పద కదలికలకు డౌట్ వచ్చి.. అధికారులు బ్యాగ్ చెక్ చేయగా.. దిమ్మతిరిగిపోయింది. అందులో కనిపించినవి చూసి గుండె గుభేల్ అయింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసా.?

వివరాల్లోకెళ్తే.. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అక్రమంగా జింక కొమ్ములు, పుర్రెను విదేశాలకు రవాణా చేస్తోన్న న్యూయార్క్ నివాసితుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. స్కానింగ్ మెషిన్‌లో సదరు నిందితుడి బ్యాగ్‌లో ఏవో వింత వస్తువులు ఉన్నట్టు తేలడంతో.. క్షుణ్ణంగా పరిశీలించి చూడగా.. జింక కొమ్ములు, పుర్రెను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించాం. ఆయా వస్తువులను స్వాధీనం చేసుకుని.. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.