Upasana Konidela: కొత్త లగ్జరీ ఆడి కొన్న మెగా కోడలు ఉపాసన.. నెట్టింట్లో వీడియో వైరల్

తనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నారు ఉపాసన. తాను సూపర్‌ లగ్జరీ ఆడి కొత్త కారు కొన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు

Upasana Konidela: కొత్త లగ్జరీ ఆడి కొన్న మెగా కోడలు ఉపాసన.. నెట్టింట్లో వీడియో వైరల్
Upasana Konidela

Updated on: May 25, 2022 | 12:57 PM

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాపవర్‌స్టార్‌ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, అపోలో అధినేత మనవరాలుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉపాసన. తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్‌ మీడియాలో (Social Media) సైతం యాక్టీవ్‌గా ఉంటారు. తన భర్త రామ్ చరణ్, ఫిట్‌ నెస్‌, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు వంటి అనేక విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారు. ఇక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ ఉపాసన అండగా నిలుస్తారు. తాజాగా తనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నారు ఉపాసన. తాను సూపర్‌ లగ్జరీ ఆడి కొత్త కారు కొన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు

ఈ సందర్భంగా ఉపాసన ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేశారు. ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ‘నా దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉండటమే. నా ఈ ఆడి ఈ-ట్రాన్(Audi E-Tron) ఆ రెండింటిని కలిగి ఉంది. అత్యాధునిక సౌకర్యాలను కలిగిన ఈ లగ్జరీ ఆడి కారు ఎంతో సురక్షితమైంది’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా ఉపాసన కొన్న ఈ లగ్జరి ఆడి ఈ-ట్రాన్‌ కారు ధర దాదాపు కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..