తన భార్య అలిగిందని.. బుజ్జగించేందుకు లీవ్ ఇవ్వాలంటూ ఓ కానిస్టేబుల్ ASPకి లెటర్ రాశాడు. ‘వివాహం జరిగి నెల కూడా గడవకముందే.. భార్యను వదిలి వచ్చినందుకు.. తను నాపై అలకబూనింది. నేను కాల్ చేసినా నో రెస్పాన్స్. వెళ్లి ఆమెకు సర్ది చెప్పాలి. లీవ్ ఇవ్వండి.’ అంటూ పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్. వివరాల్లోకి వెళ్తే.. గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ 2016 బ్యాచ్‌కు చెందినవాడు. మౌ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ప్రజంట్ మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌత్వానా పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. గౌరవ్‌కు గతేడాది డిసెంబర్లో పెళ్లైయ్యింది. అనంతరం తన భార్యను ఇంటి వద్ద వదిలి వచ్చి.. డ్యూటీకి చేస్తున్నాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. మేనల్లుడి బర్త్ డేకు వారం రోజులు లీవ్ తీసుకుని వస్తానని భార్యకు చెప్పాడు. కానీ దానికి ముందుగానే అతడి భార్య ఫోన్‌కాల్స్‌కు రెస్పాండ్ అవ్వడం మానేసి తన కోపాన్ని చూపుతోంది.
దీంతో తన పరిస్థితిని వివరిస్తూ.. వారం రోజులు సెలవూ కోరుతూ ఉన్నతాధికారికి లేఖ రాశాడు. ఆ లెటర్‌లో.. “మ్యారేజ్ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లలేదు. నా భార్య ఫోన్ చేసినా కట్ చేస్తుంది. కొన్నిసార్లు ఫోన్ ఎత్తి.. మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోంది. అందుకే నాకు లీవ్స్ ఇవ్వండి సార్ ” అని రాసుకొచ్చాడు. సాటి మగాడిగా.. ఓ భర్తగా ఆ కానిస్టేబుల్ ఇబ్బంది అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్.. 5రోజులు లీవ్స్ ఇచ్చాడు. గౌరవ్ లీవ్స్ జనవరి 10న ప్రారంభం కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..