Viral: బహిరంగ మలవిసర్జన చేస్తుండగా ప్రైవేట్ పార్ట్ నుంచి కడుపులోకి వెళ్లిన పాము.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

|

Apr 07, 2023 | 5:59 PM

అర్థరాత్రి ఆస్పత్రికి వచ్చాడు. సమస్య ఏంటి అంటే కడుపులో నొప్పి అన్నాడు. మహా అయితే ఏదో మసాలా ఫుడ్ తిని ఉంటాడు. గ్యాస్ పట్టి ఉంటుంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చి,.. 2 ట్యాబ్లెట్లు ఇచ్చి.. పంపిద్దామనుకున్నారు అక్కడి మెడికల్ స్టాఫ్. కానీ అతడు చెప్పిన మాటలు విని కంగుతిన్నారు.

Viral: బహిరంగ మలవిసర్జన చేస్తుండగా ప్రైవేట్ పార్ట్ నుంచి కడుపులోకి వెళ్లిన పాము.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?
Snake (Representative image)
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఇన్సిడెంట్ వెలుగుచూసింది. హర్దోయ్ జిల్లాకు చెందిన మహేంద్ర అనే వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో అర్థరాత్రి వేళ హర్దోయ్ మెడికల్ కాలేజీ అత్యవసర విభాగానికి వెళ్లాడు. ఏమైందని వైద్యులు ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి ప్రవేశించిందని తెలిపాడు. అప్పట్నుంచి పొత్తి కడుపులో భరించలేని నొప్పి వస్తుందని తెలిపాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు అతడు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా స్టన్నయ్యారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పూర్తిగా తనిఖీలు, ఇతర టెస్టులు చేసిన అనంతరం.. అతడిని పాము కాటు వేసినట్లు గానీ, కడుపులో ఏదైనా వస్తువు ఉన్నట్లు కానీ ఆధారాలు లభించలేదు.

వైద్య సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా మహేంద్రను మరో ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో అక్కడి డాక్టర్లు కూడా చేసేదేం లేక సరే అన్నారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు, అతను డ్రగ్స్ మత్తులో ఇలా చేశాడని గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అతన్ని డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.

“ఆ వ్యక్తి డ్రగ్స్ ప్రభావంలో ఉన్నట్లు కనిపించాడు. మాదకద్రవ్యాల వాడకం వల్ల అప్పుడప్పుడు తనకు కడుపు నొప్పి వచ్చేది. ఆ విషయం అతడు కుటుంబ సభ్యలతో ఎప్పుడూ చెప్పలేదు. తాజాగా నొప్పి అధికం అవ్వడం.. ఇంట్లో వాళ్లకు చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం, యువకుడికి CT స్కాన్ చేశాం. రిపోర్ట్స్‌లో ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. అయినా కానీ, అతని కుటుంబ సభ్యులు అతన్ని మరో ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. దీంతో డిశ్చార్జ్ చేశాం” అని డాక్టర్ షేర్ సింగ్ తెలిపారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం