Viral Video: చూసేందుకు సాంప్రదాయిని సుప్పిని.. చేసిన పని చూస్తే షాక్.. సీసీటీవీలో అడ్డంగా బుక్కయ్యారు..!

కిలాడీ జంట గోల్డ్ షాప్‌కు వెళ్లింది. నెక్లెస్ కొంటున్నట్లు కొద్దిసేపు యాక్ట్ చేశారు. అన్నీ తీసి చూయించమన్నారు. నెక్లెస్‌లను చూస్తున్న సమయంలో ఆ మహిళ చాలా చాకచక్యంగా ఒక బంగారు నెక్లెస్‌ను తీసుకొని తన చీర కింద దాచుకుంది. ఆ తర్వాత వెంటనే తన స్నేహితుడితో కలిసి ఏమీ తెలియనట్లు దుకాణం నుండి బయటకు వెళ్లిపోయింది.

Viral Video: చూసేందుకు సాంప్రదాయిని సుప్పిని.. చేసిన పని చూస్తే షాక్.. సీసీటీవీలో అడ్డంగా బుక్కయ్యారు..!
Up Couple Steals Gold Necklace

Updated on: Oct 01, 2025 | 4:35 PM

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగరంలో ఒక ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. ఒక జంట ఆభరణాల షోరూమ్‌లోకి కస్టమర్స్‌లా వచ్చి.. రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను దొంగిలించింది. ఈ దొంగతనం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆభరణాల దుకాణంలో నెక్లెస్‌లను చూసేందుకు ఆ జంట వచ్చింది. అప్పటికే షాప్ మూసివేసే సమయం కావడంతో, దుకాణదారుడు స్టాక్ తనిఖీ చేసుకుంటున్నాడు.

నెక్లెస్‌లను చూస్తున్న సమయంలో ఆ మహిళ చాలా చాకచక్యంగా ఒక బంగారు నెక్లెస్‌ను తీసుకొని తన చీర కింద దాచుకుంది. ఆ తర్వాత వెంటనే తన స్నేహితుడితో కలిసి ఏమీ తెలియనట్లు దుకాణం నుండి బయటకు వెళ్లిపోయింది. షోరూమ్ యజమాని గౌరవ్ పండిట్ స్టాక్ చెక్ చేస్తుండగా.. బంగారం తక్కువైనట్లు గుర్తించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయి.. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆ జంట ఈ దొంగతనం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. వారు దొంగలించిన నెక్లెస్ విలువ దాదాపు రూ. 6 లక్షలు ఉంటుందని అంచనా. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని.. త్వరలోనే ఆ జంటను గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

వీడియో చూడండి