Viral Video: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? అతడి పేరే వైబ్రేషన్.. అతనే ఓ ఎమోషన్

|

Apr 17, 2024 | 5:18 PM

ఇతడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. అసాధారణమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి. జీతంతో జీవితం గడవాలి. అలాంటి వ్యక్తి ..కెరీర్‌లో ఎవరెస్ట్‌లు చూశాడు. పర్సనల్‌గా కోలుకోని విషాదాన్ని టచ్ చేశాడు. ఓ వైపు కెరీర్..మరోవైపు పర్శనల్ డిస్టబెన్స్. అలాంటి సిట్చువేషన్‌లో ఓ ఆటగాడిగా తన కెరీర్‌ను మలుచుకున్న తీరు...ఎందరికో ఆదర్శం. ఇంతకీ ఇతడెవరో మీరు గుర్తుపట్టారా..?

Viral Video: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? అతడి పేరే వైబ్రేషన్.. అతనే ఓ ఎమోషన్
Viral Photo
Follow us on

ప్రజంట్ సార్ట్స్, సెలబ్రిటీల త్రో బ్యాక్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అభిమానులు వాటిని ట్రెండింగ్‌లోకి తెస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఓ ఫోటోను తీసుకొచ్చాం. ఈ ఫోటోలోని అబ్బాయి పేరు చెబితే జనాలు పూనకాలతో ఊగిపోతారు. అతనో క్రికెట్ ప్లేయర్. ఆటలో దూకుడు ఉంటుంది కానీ.. వ్యక్తిగతంగా ఎప్పుడూ కూల్‌‌గా ఉంటాడు. భారత క్రికెట్ అభిమానలుకు గుండెల్లో చిరకాలం గుర్తిండిపోయే విజయాలను అందించాడు. ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఇతడికి పేరుంది. ఇప్పటికే తనెవరో చాలామంది గెస్ చేసి ఉంటారు. యస్ మీ ఊహ కరెక్టే.. తను మిస్టర్ కూల్… మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్‌ వరల్డ్‌లో  ఓ లెజెండ్. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ధోని ఇన్నింగ్స్‌కు ఎండ్ కార్డ్ పడినా.. క్రికెట్ ఉన్నంత వరకు అతని నేమ్ అండ్ ఫేమ్ చెరిగిపోవు.

తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తాడు. గ్రౌండ్‌లో టెన్షన్‌ పడిన సందర్భం లేదు. మిస్టర్ కూల్ అన్న ట్యాగ్‌తో భారత్‌కు అపురూపమైన విజయాలు అందించాడు. గ్రౌండ్‌లో..డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ ప్లేయర్ ఎలా ఉండాలో ధోనిని చూసి నేర్చుకోవాలని మాజీ లెజెండ్స్ సైతం చెబుతుంటారు. జట్టు కూర్పు ఎలా ఉండాలి… ఎప్పుడు ఎవర్ని బ్యాటింగ్‌కు పంపాలి.. బంతి ఎవరికి ఇవ్వాలి వంటివి ధోనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతుంటారు. భారత క్రికెట్ లెజెండ్స్.. రిటైర్మెంట్‌కు దగ్గరపడిన సందర్భంలో భారత క్రికెట్‌కు ఓ వరంలా ధోని దొరికాడు. ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు తీసుకెళ్లగల సారథిగా మారాడు.

భారత క్రికెట్‌ పగ్గాలు ధోని చేపట్టిన తర్వాత… భారత ఆటతీరే మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఎన్ని విమర్శలు వచ్చినా దోని రెస్పాన్డ్‌ కాలేదు సరికదా..వాటిని కనీసం పట్టించుకున్న సందర్భం కూడా లేదు. కేవలం తన ఆటతోనే విమర్శకుల నోర్లు మూయించేవాడు. టెస్టులు, వన్డేలు, టీ20లకు గుడ్ బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం.. కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. గ్రౌండ్‌లోకి తల ధోని వస్తున్నాడంటే.. ఆ వైబ్ ఎలా ఉంటుందో చెప్పడం కూడా కుదరదు. ఆ వైబ్ ఎంజాయ్ చేయాలంటే గ్రౌండ్‌లో ఉండాల్సిందే. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు ధోని గుడ్ బై చెబుతాడని వార్తలు వస్తున్నాయి. అలా జరగకుండా ఉందామని కోరుకుందాం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..