Watch: బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..

ఒక చర్చిలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కేరోజు 5 వేల జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి తంతును యూనిఫికేషన్ చర్చి యాజమాన్యం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో జంటల తల్లిదండ్రులు, బంధువులు కూడా పాల్గొని వధూవరులను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Watch: బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..
Wedding

Updated on: Apr 12, 2025 | 7:48 PM

పదులు, వందలు కాదు.. వెయ్యి,రెండు వేలు కూడా కాదు..ఏకంగా ఐదువేల జంటలు ఒకేసారి ఒకేవేదికపై పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యాయి. దక్షిణ కొరియాలోని యూనిఫికేషన్ చర్చి ప్రధాన కార్యాలయంలో జరిగిన సామూహిక వివాహానికి వేలాది జంటలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఖండాంతరాలు దాటుకుని సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు బాహుబలి వివాహ వేదిక అంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

దక్షిణ కొరియాలోని యూనిఫికేషన్ చర్చిలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కేరోజు 5 వేల జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి తంతును యూనిఫికేషన్ చర్చి యాజమాన్యం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో జంటల తల్లిదండ్రులు, బంధువులు కూడా పాల్గొని వధూవరులను దీవించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..