Viral Video: పాకిస్థాన్‌కు గ్రహాంతరవాసులు వచ్చారా..? ఆకాశంలో చక్కెర్లు కొట్టిన అనుమానాస్పద వస్తువు.. వీడియో

|

Feb 24, 2022 | 12:46 PM

UFO sighting in Pakistan: పాకిస్థాన్‌‌ ఇస్లామాబాద్‌లోని ఆకాశంలో కనిపించిన గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను

Viral Video: పాకిస్థాన్‌కు గ్రహాంతరవాసులు వచ్చారా..? ఆకాశంలో చక్కెర్లు కొట్టిన అనుమానాస్పద వస్తువు.. వీడియో
Ufo
Follow us on

UFO sighting in Pakistan: పాకిస్థాన్‌‌ ఇస్లామాబాద్‌లోని ఆకాశంలో కనిపించిన గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బర్మింగ్‌హామ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆర్స్‌లాన్‌ వార్రైచ్ తన డ్రోన్‌ ద్వారా తీసి సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేశారు. అయితే అది పక్షి లేదా, డ్రోన్‌ కాదంటూ ఆయన స్పష్టంచేశారు. అనంతరం ఈ వస్తువు గురించి పాకిస్తాన్ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ మిస్టరీ (Mysterious flying) ఘటనకు సంబంధించిన యూఎఫ్‌వో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌, పోష్‌ జిల్లాలోని గగనతలంపై ఈ గుర్తుతెలియని వస్తువు చాలా సేపు ఎగిరినట్లు ఆర్స్‌లాన్ వెల్లడించారు. డ్రోన్ ద్వారా 12 నిమిషాలకుపైగా పలు కోణాల్లో దానిని చిత్రీకరించించానని తెలిపారు. ఈ గగనతలంలో మిస్టరీ వస్తువును సుమారు రెండు గంటలకుపైగా చూసినట్లు పేర్కొన్నారు. డ్రోన్‌ కెమెరాను జూమ్‌ చేసి చూడగా.. నల్లగా, త్రిభుజాకారంలో అది కనిపించింది.

కాగా.. మరోవైపు ఈ మిస్టరీ యూఎఫ్‌వో వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. చాలా మంది నెటిజన్లు గ్రహాంతరవాసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది పెద్ద గాలిపటమని కొందరు పేర్కొంటుంగా.. ఇది చాలా ఆసక్తికరంగా ఉందని.. పరిశోధన చేయాలని పేర్కొంటున్నారు.

దీనికి సంబంధించిన ఫుటేజీలు ఆన్‌లైన్‌లో చాలానే వస్తున్నాయి. ఇది UFO దృశ్యమా లేదా కేవలం బూటకమా అని నెటిజన్లు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల నుంచి గ్రహాంతరవాసులు ఉన్నారా..? లేదా అనే విషయంపై పరిశోధన జరుగుతున్న క్రమంలో ఈ అనుమానస్పద వస్తువు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Viral Video: శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు.. ‘విస్కీ’ స్టోరీ విని ఆశ్చర్యపోతున్న నెటిజనం.. ఏమైందంటే..?

Viral Video: దమ్ముంటే ఇక్కడకు వచ్చేయండి చూద్దాం.. వేటగాళ్లకు జింకల సవాల్.. వీడియో