Wedding In The Sky: వారెవ్వా.. ఆకాశంలో ప్రేమ పెళ్లి.. కూతురి సంతోషం కోసం ఓ తండ్రి ఇచ్చిన అపూర్వ కానుక..

|

Nov 26, 2023 | 5:44 PM

వివాహం గురించి దిలీప్ పోప్లే అల్లుడు హృదేశ్ సైనానీ మాట్లాడుతూ, ఫ్లైట్‌లో తను హై స్కూల్‌ నుంచి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రేమ పెళ్లికి అంగీకరించిన తమ తల్లిదండ్రులు, పెళ్లికి విచ్చేసిన మిత్రులు, బంధువులు, జెటెక్స్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వధూవరులు, అతిథులతో బయల్దేరిన విమానం దుబాయ్ నుండి ఒమన్‌కు 3 గంటల పాటు ప్రయాణం చేసింది. ఈ సందర్భంలోనే దిలీప్‌ పోప్లే కుమార్తె వివాహ వేడుకను నిర్వహించారు.

Wedding In The Sky: వారెవ్వా.. ఆకాశంలో ప్రేమ పెళ్లి.. కూతురి సంతోషం కోసం ఓ తండ్రి ఇచ్చిన అపూర్వ కానుక..
Wedding In The Sky
Follow us on

ఒక తండ్రికి అతని కుమార్తె ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. కూతురి సంతోషం కోసం తండ్రి ఏం చేయడానికైనా సిద్ధమే. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి పెళ్లి విషయానికి వస్తే.. ఈ క్షణం తండ్రికి పట్టరాని సంతోషంతో పాటు దుఃఖం కూడా కట్టలు తెంచుకుంటుంది. ప్రతి తండ్రి తన కూతురి పెళ్లిని గుర్తుండిపోయేలా చేయడానికి తన శక్తికి మించి ఖర్చు చేస్తాడు. ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ తండ్రి తన కూతురి పెళ్లి జరిపించిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. యూఏఈ నుంచి వెలుగులోకి వచ్చిన ఈ పెళ్లిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. యుఎఇకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పోప్లే తన కుమార్తె వివాహం ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747లో ఆకాశంలో ఎగురుతుండగా జరిపించాడు. ఆకాశంలో జరిగిన ఈ పెళ్లికి 300 మంది అతిథులు కూడా హాజరయ్యారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వివాహం దుబాయ్‌లో జరిగింది.

బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్‌లు ఎల్లప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయని మనందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితిలో తన కుమార్తె వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి, యుఎఇకి చెందిన భారతీయ ఆభరణాల వ్యాపారవేత్త దిలీప్ పోప్లే 300 మంది అతిథులతో ఆకాశంలో ఎగురుతున్న ప్రైవేట్ జెట్‌లో వివాహ వేడుకను నిర్వహించారు. ఈ ప్రత్యేక వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వివాహ బృందం విమానంలో సందడిగా డ్యాన్స్‌ చేస్తున్నారు. మరోవైపు, దిలీప్ పోప్లే కుమార్తె విధి పోప్లే, హృదేష్ సైనానీల వివాహం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. యుఎఇకి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పోప్లే నవంబర్ 24న దుబాయ్‌లో ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747 విమానంలో తన కుమార్తె వివాహం జరిపించారు.. అని వీడియో క్యాప్షన్‌లో రాసుకోచ్చారు. వివాహం గురించి దిలీప్ పోప్లే అల్లుడు హృదేశ్ సైనానీ మాట్లాడుతూ, ఫ్లైట్‌లో తను హై స్కూల్‌ నుంచి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రేమ పెళ్లికి అంగీకరించిన తమ తల్లిదండ్రులు, పెళ్లికి విచ్చేసిన మిత్రులు, బంధువులు, జెటెక్స్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

వధూవరులు, అతిథులతో బయల్దేరిన విమానం దుబాయ్ నుండి ఒమన్‌కు 3 గంటల పాటు ప్రయాణం చేసింది. ఈ సందర్భంలోనే దిలీప్‌ పోప్లే కుమార్తె వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్బంగా పోప్లే మాట్లాడుతూ తన కుమార్తె కోసం ఇలాంటి సర్‌ప్రైజ్‌ ఏదో ఒకటి చేయాలని తను ఎప్పుడూ కలలు కనేవాడినని, అన్ని కలలను నెరవేర్చే దుబాయ్‌ని మించిన ప్రదేశం లేదని సంతోషంగా చెప్పుకొచ్చారు. తాను కూడా 1994లో ఎయిరిండియా విమానంలో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని ఆయన తండ్రి లక్ష్మణ్ పోప్లే నిర్వహించారని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..