
Watch Video: పాము పేరు చెబితేనే మనం హడలిపోతాం. అలాంటి మన కళ్ల ముందు కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా? గుండె జారిపోతుంది. మనుషులైనా, జంతువులైనా పామును చూస్తే భయంతో పక్కకు పోవాల్సిందే. లేదంటే.. పాము కాటు వేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాము విషపూరితమైంది కాబట్టి. అయితే, ఇద్దరు మనుషులు కొట్టుకోవడం, రెండు జంతువులు కుమ్ముకోవం చూసే ఉంటాం. మరి రెండు పాముల పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. రెండు పాములు భీకరంగా పోరాటం సాగించాయి. అది కూడా నీటిలో ఒకదానిపై మరొకటి కత్తులు దూస్తున్నట్లుగా ఘోరంగా పోరాడాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
చాలా వరకు పాములు సయ్యాటలాడటం మనం చూస్తుంటాం. అది కూడా భూమిపైనే జరుగుతుంది. మరి నీటిలో రెండు పాముల పోరాటం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో రెండు పాములు నీటిలోనే యుద్ధం చేస్తున్నారు. ఒకదానికొకటి ఘోరంగా తలపడుతున్నాయి. ఈ పాముల ఫైటింగ్ చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో నదిలో రెండు పాములు ఉన్నాయి. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న రెండు పాములు.. ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఒకదానికొక అల్లుకుంటూ, మెలికలు పడుతూ రచ్చ క్రియేట్ చేశాయి. ఈ సీన్‌ను కొందరు వ్యక్తులు.. తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. రెండు పాములు కొట్టాడుకుంటున్నాయని సదరు వ్యక్తులు మాట్లాడటం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో సైన్స్.ఫీడ్ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికి పైగా లైక్ చేశారు. పాముల ఫైటింగ్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పాముల పోరాటాన్ని నేను మొదటిసారి చూశాను’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..