Viral Video: వార్నీ ఎంతకు తెగించారు.. రైలు ప్రయాణం ఇలా కూడా చేస్తారా.?

|

Oct 04, 2024 | 8:00 PM

ఇలాంటి ఎన్నో వీడియోలు ప్రతీ రోజూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. రైలులో రద్దీ ఎక్కువగా ఉందో మరే కారణమో.. కానీ ఇద్దరు వ్యక్తులు రైలు చివరి బోగీకి ఉండే రాడ్‌లపై కూర్చొని ప్రయాణం చేశారు...

Viral Video: వార్నీ ఎంతకు తెగించారు.. రైలు ప్రయాణం ఇలా కూడా చేస్తారా.?
Viral Video
Follow us on

ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇక రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలను చూడాల్సిన పరిస్థితి వస్తోంది. కొందరు ఎలాగైనా సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

ఇలాంటి ఎన్నో వీడియోలు ప్రతీ రోజూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. రైలులో రద్దీ ఎక్కువగా ఉందో మరే కారణమో.. కానీ ఇద్దరు వ్యక్తులు రైలు చివరి బోగీకి ఉండే రాడ్‌లపై కూర్చొని ప్రయాణం చేశారు. బహుశా వాళ్లివద్దరు భార్యభర్తలుగా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ రైలు నెమ్మదిగా మూవ్‌ అవుతోంది. అదే సమయంలో రైలుకు చివరన బోగీలను అటాచ్‌ చేసేందుకు ఉపయోగించే రాడ్‌లపై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు టికెట్ చెకింగ్ ఎలా చేస్తారో చేసుకోండి అనే క్యాప్షన్‌తో రాసుకొచ్చారు. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు ఇంతటి సాహసం అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..