Birds love: ఆకాశంలో అందాల పక్షులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..వైరల్ అవుతున్న ఈ వీడియో మీరూ చూసేయండి..Viral Video

ప్రేమ అనండి.. స్నేహం అనండి.. ఆ రెండు పదాలకూ మనలోనే కాదు జంతువులు, పక్షుల్లోనూ కూడా ప్రాముఖ్యం ఉంటుంది.

Birds love: ఆకాశంలో అందాల పక్షులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..వైరల్ అవుతున్న ఈ వీడియో మీరూ చూసేయండి..Viral Video
Birds Love

Updated on: Apr 25, 2021 | 8:46 PM

Birds love: ప్రేమ అనండి.. స్నేహం అనండి.. ఆ రెండు పదాలకూ మనలోనే కాదు జంతువులు, పక్షుల్లోనూ కూడా ప్రాముఖ్యం ఉంటుంది. మనుషులు ఎలాగైతే తమ ప్రేమను చాటుకోవడానికి.. అవతలి వ్యక్తిపై ఇష్టాన్ని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారో అలాగే పక్షులూ, జంతువులూ కూడా చేస్తాయి. నిజానికి జంతు ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూస్తే ఎన్నో ముచ్చట గొలిపే సంఘటనలు కనిపిస్తాయి. ఒక్కోసారి అవి చేసే పనులకు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటాం కూడా. అలాగే అవి చేసే పనులు చాలా క్యూట్ గా.. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటాయి.
ఇక అసలు విషయానికి వస్తే, మనం రోడ్డు మీద లిఫ్ట్ అడిగి ఎదో వాహనం ఎక్కి వెళ్లినట్టు.. ఆకాశంలో వెళుతున్న ఓ పక్షి ఇంకో పక్షికి లిఫ్ట్ ఇవ్వడం చూశారా? ఇదిగో ఇక్కడ వీడియో మీకోసమే. ఒక పక్షి గాలిలో మరో పక్షిని తన వీపుపై ఎక్కించుకుని చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియో షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోకి డబుల్ డెక్కర్ అని శీర్షిక పెట్టారు.

పై వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. టైటానిక్ లా ఉందని ఒకరూ.. భలే ఉంది అని ఒకరూ ఇలా బోలెడు కామెంట్లు ఈ వీడియోకి వస్తున్నాయి అవి మీరూ ఇక్కడ చూడొచ్చు.. చూసి ఊరుకోకండి.. మీరూ ఓ లైకో..కామేంటో చేసేయండి ఓ పని అయిపోతుంది..