Viral: ట్రైన్‌లోకి పోలీసుల రాగానే తత్తరపాటు.. వారి వద్ద ఉన్న బ్యాగులు చెక్ చేయగా

|

May 19, 2024 | 3:49 PM

పోలీసులు అంటే భయం లేదు. బస్సులు, రైళ్లలను కూడా తమ అక్రమ వ్యాపారాలకు అనువుగా మలుచుకుంటున్నారు. జైలుకి వెళ్లి వచ్చినా బుద్ది మార్చుకోవడం లేదు. మళ్లీ అదే రొంపిలోకి దిగుతున్నారు. ఈజీగా మనీ అర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Viral: ట్రైన్‌లోకి పోలీసుల రాగానే తత్తరపాటు.. వారి వద్ద ఉన్న బ్యాగులు చెక్ చేయగా
Railway Police (Representative image)
Follow us on

సొసైటీలో జాదు గాళ్లు పెరిగిపోతున్నారు. వ్యవస్థలు, పోలీసులు అంటే భయం లేదు. ఏకంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లను కూడా అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను పట్టుకుని జైల్లో పెట్టినా మారడం లేదు. తిరిగి బయటకు వచ్చాక అదే తరహా క్రైమ్స్ కొనసాగిస్తున్నారు. తాజగా తమిళనాడులోని రాణిపేట సమీపంలోని అరక్కోణం రైల్వే స్టేషన్‌లో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఆకస్మిక తనిఖీల్లో 16 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.

ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు రైలులోని అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో సోదాలు చేపట్టారు. ఒక కోచ్‌లోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూడగానే తత్తరపాటుకు గురయ్యారు. వారు టెన్షన్ పడుతూ కనిపించడంతో పోలీసులు వివరాలు అడగ్గా.. ఇద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో  పోలీసు బృందం వారి బ్యాగులను తనిఖీ చేయగా, ఎనిమిది ప్యాకెట్లలో గంజాయిని గుర్తించారు. అరెస్టయిన వ్యక్తులు ఒడిశాకు చెందిన ఎస్. అర్జున్ మాలిక్(24) కాంచీపురంకు చెందిన వి. మణికందన్ (37)గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడ తక్కువ రేటుకు గంజాయిని కొని… కాంచీపురం, వెల్లూరు, అరక్కోణం, తిరువణ్ణామలై వంటి పట్టణాల్లోని స్థానిక పంపిణీదారులకు ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇకపై రైళ్లలో కూడా నిత్యం తనిఖీలు చేస్తామని ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు తెలిపారు. ఇందుకోసం పోలీసు డాగ్స్‌కు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రైళ్లలో గంజాయి రవాణా చేస్తే.. కఠినమైన సెక్షన్స్  పెడతామని హెచ్చరించారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…