ట్రంప్ అల్లుడి ఫోన్ హ్యాక్.. సౌదీ నేతలతో రహస్య ఒప్పందాలు?

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చుట్టూ వివాదం మొదలైంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ నాయకులతో ఆయనకు రహస్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ వానిటీ ఫెయిర్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానాలకు అనుకూలంగా వ్యవహరించేందుకు మధ్యప్రాచ్య దేశాల నేతలు భారీ మొత్తంలో నిధులు సమకూర్చారన్నది ఆ కథనంలో ప్రధాన ఆరోపణ.

ట్రంప్ అల్లుడి ఫోన్ హ్యాక్.. సౌదీ నేతలతో రహస్య ఒప్పందాలు?
Trump Son In Law Hacked Phone Shows Secret Dealings With Saudi

Updated on: Oct 24, 2026 | 8:20 PM

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చుట్టూ వివాదం మొదలైంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ నాయకులతో ఆయనకు రహస్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ వానిటీ ఫెయిర్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానాలకు అనుకూలంగా వ్యవహరించేందుకు మధ్యప్రాచ్య దేశాల నేతలు భారీ మొత్తంలో నిధులు సమకూర్చారన్నది ఆ కథనంలో ప్రధాన ఆరోపణ.

కుష్నర్ ఫోన్‌ను హ్యాక్ చేశారా?

మాథ్యూ కోల్ రాసిన Princes and Thieves: Jared Kushner and Mohamed bin Zayed’s Secret Plot to Remake the Middle East అనే పుస్తకంలోని కొన్ని వివరాల ఆధారంగా వానిటీ ఫెయిర్‌ కథనం ప్రచురించింది. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో జారెడ్ కుష్నర్ ఐఫోన్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన నిఘా అధికారులు హాక్‌ చేయగా అందులో యూఏఈకి సంబంధించిన బ్యాంకు ఖాతాను ఉపయోగించినట్లు తెలిసింది. అజర్‌బైజాన్‌లోని ఓ బ్యాంకు నుంచి వందల మిలియన్ డాలర్ల నిధులు ఆ ఖాతాకు మళ్లినట్లు తేలింది.

సౌదీ యువరాజు, యూఏఈ నేతల పాత్ర ఏమిటి?

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ ఈ నిధుల వ్యవహారం వెనుక ఉన్నారని వానిటీ ఫెయిర్ కథనం ఆరోపించింది. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానం లక్ష్యాలకు మద్దతు ఇచ్చేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలనే ఆలోచన వీరిద్దరినీ అనీ,  అయితే, ఆ ప్రణాళిక చివరకు ముందుకు సాగలేదని కథనం తెలిపింది.

అదే సమయంలో, కుష్నర్‌కు సంబంధించిన రెండు ఖాతాల్లోకి ఈ ఇద్దరు మధ్యప్రాచ్య నేతలు కనీసం 2 బిలియన్ డాలర్లు జమ చేసినట్లు కథనం ఆరోపించింది. మరో ఖాతా ద్వారా సౌదీ యువరాజు ఒక బిలియన్ డాలర్లను కుష్నర్ వ్యక్తిగత ప్రయోజనం కోసం బదిలీ చేసినట్లు తెలిపింది. అలాగే, యూఏఈ అధ్యక్షుడు ఈ బదిలీకి ఏర్పాట్లు చేశారని, ఆ డబ్బును ఇజ్రాయెల్‌లో జమ చేయాలని అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కుష్నర్‌ను ప్రోత్సహించారని రాసుకొచ్చింది. ఈ లావాదేవీల గురించి కుష్నర్, నెతన్యాహుతో అప్పటి అమెరికా రాయబారి డేవిడ్ ఫ్రైడ్‌మన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు కూడా పేర్కొంది.

‘అవన్నీ కల్పిత కథలు’.. కుష్నర్ తీవ్ర స్పందన

తనపై వచ్చిన ఆరోపణలను జారెడ్ కుష్నర్ ఖండించారు. ఇవి పూర్తిగా కల్పితమైనవని, వాస్తవాలతో సంబంధం లేని ఆరోపణలని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, నగదు బదిలీ రికార్డులు, ఖాతా నంబర్లు, లావాదేవీలు జరిగిన తేదీలు వంటి వివరాలేవీ అందించలేదని కుష్నర్ అన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం జర్నలిజం కాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో తాను ప్రపంచంలోనే అత్యధికంగా పరిశీలనకు గురైన వ్యక్తుల్లో ఒకరినని కుష్నర్ గుర్తుచేశారు. మీడియా కథనాలతో పాటు కాంగ్రెస్ దర్యాప్తులు, ప్రత్యేక న్యాయవాది విచారణను కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ విచారణలకు తాను స్వచ్ఛందంగా సహకరించానని, 30 గంటలకు పైగా వాంగ్మూలం ఇచ్చానని తెలిపారు. అప్పట్లో ఈ ఆరోపణలు ఎక్కడా వెలుగులోకి రాలేదని, ఎందుకంటే అలాంటి ఘటన జరగలేదని ఆయన వాదించారు.

ట్రంప్ విదేశాంగ విధానాల్లో కుష్నర్ కీలక పాత్ర

45 ఏళ్ల జారెడ్ కుష్నర్.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భర్త. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో సీనియర్ వైట్‌హౌస్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం ట్రంప్ చేపడుతున్న శాంతి చర్చల్లో ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల నేతలతో కుష్నర్‌కు ఉన్న సంబంధాలు, ఆయనపై వచ్చిన ఆర్థిక ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us