Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని షాకిస్తుంటాయి. నెటిజన్లను ఆకర్షించడంలో చిన్నారుల వీడియోలు కూడా ముందంజలో నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ చిన్నారి(Baby Girl Viral Video)కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. బీజేపీ ఎంపీ పీసీ మోహన్(MP PC Mohan) తన ట్విట్టర్‌లో ఓ చిన్నారికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ చిన్న అమ్మాయి సైనికుడి పాదాలను తాకినట్లు చూడొచ్చు. వీడియోను షేర్ చేస్తూ, బెంగళూరు ఎంపీ క్యాప్షన్‌లో ‘యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది’ అంటూ రాసుకొచ్చారు.
నలుగురు ఆర్మీ జవాన్లు మెట్రో స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అప్పుడే వారి చెంతకు ఒక చిన్నారి పరుగెత్తుకుంటూ వస్తుంది. వారివద్దకు చేరుకున్న ఆ చిన్నారి.. కొద్దిసేపు వారిని అలా చూస్తుండిపోయింది. ఆ తర్వాత ఒక యువకుడి పాదాలను తాకి, దండం పెట్టుకుంది. దీంతో ఆ సైనికుడు ఉద్వేగానికి లోనయ్యాడు. అమ్మాయి తలపై తన చేతిని ఉంచి, ఆశ్వీరదించాడు. ఇది చూసి పక్కనే ఉన్న ఇతర సైనికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ వీడియో ఏ నగరానికి చెందినదో మాత్రం తెలియరాలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ పాపకు ఆశీస్సులు అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి కుమార్తెకు ఇంత అద్భుతమైన విలువలు ఇచ్చినందుకు ఆ పాప కుటుంబానికి కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను 9 లక్షల మందికి పైగా చూడగా, వేల మంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఈ వీడియోకు 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
संस्कार उम्र से बड़े है बिटिया रानी के… जय हिंद जय भारत ??❤️..!! pic.twitter.com/U998Um1fMz
— Vikash Mohta ?? (@VIKASHMOHTA90) July 15, 2022
పిల్లలకు ఇలాంటి విద్యను అందించాలంటూ కామెంట్లు..
సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత, – పిల్లలకు మొదటి నుంచి ఈ విషయాలు నేర్పించాలంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొక వినియోగదారు – ఇది భారతీయత, ఇది మన సంస్కృతి అంటూ రాసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..