వైరల్ వీడియోలో ఒక రిక్షా కార్మికుడు తన రిక్షాతో రైలు పట్టాలు దాటుతున్నాడు.. ఈ క్రమంలనే తన రిక్షా టైర్ ఒకటి రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రావటం లేదు. రిక్షాను బయటకు తీసేందుకు ఆ రిక్షా కార్మికుడు తన బలాన్నంత ఉపయోగించి ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఆ టైర్ బయటకు రావటం లేదు. అదే సమయంలో ఆ పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తోంది. కానీ, అతడు వెనక్కి తగట్టం లేదు. ఎలాగైనా సరే.. తన రిక్షాను రైలు ఢీకొట్టే సమయానికి కాపాడుకోవాలని ప్రయత్నించారు. కానీ, రైలు ఆగలేదు.. వేగంగా దూసుకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.
రిక్షా టైర్ ఇరుక్కుపోయిన ట్రాక్‌పైనే హైస్పీడ్ రైలు దూసుకొచ్చింది. అక్కడ్నుంచి అందరూ పారిపోయారు. కానీ రిక్షా యజమాని మాత్రం చివరి వరకు తన శాయశక్తులా తన రిక్షాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. చివరు తన రిక్షా స్వల్పంగా దెబ్బతిని సురక్షితంగా బయటపడింది. ఆ కార్మికుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. జీవనోపాధికి ఆధారం అయిన తన రిక్షాను కాపాడుకునేందుకు ఆ కార్మికుడు చేసిన ప్రయత్నాలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇది రిక్షా కార్మికుడి నిర్లక్ష్యానికి కారణమని కొందరు చెబుతుండగా, మరికొందరు వినియోగదారులు రిక్షా కార్మికుడి శ్రమను అభినందిస్తున్నారు.
Train Crushed Rickshaw (This Clip is From Bangladesh)
pic.twitter.com/ZdZCFUzQY7— Ghar Ke Kalesh (@gharkekalesh) June 12, 2024
మైక్రోబ్లాగింగ్ సైట్ X @gharkekalesh హ్యాండిల్ ద్వారా ఈ వీడియో మే 12న పోస్ట్ చేయబడింది. అతను క్యాప్షన్‌లో రాశాడు – రైలు రిక్షాను చితక్కొట్టింది. ఈ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదిగా చెబుతున్నారు. ఈ వీడియోకు ఐదు వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..