అమ్మో బాబోయ్.. 17 ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా వాటితోనే జీవనం సాగిస్తున్నాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

|

May 18, 2023 | 3:15 PM

ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక్కో అలవాటు, అభిప్రాయాలు ఉంటాయి. అలాగే ఆహారం తీసుకొనే విషయంలో కూడా ఎవరికి వారు భిన్న రుచులను ఇష్టపడతారు. కొంతమంది వెజ్ భోజనం మాత్రమే తింటారు. మరికొందరు వెజ్, నాన్వెజ్ రెండింటిని లాగించేస్తారు. ఇంకొందిరికైతే ముక్క లేనిదే ముద్ద దిగదు.

అమ్మో బాబోయ్.. 17 ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా వాటితోనే జీవనం సాగిస్తున్నాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Gholamreza
Follow us on

ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక్కో అలవాటు, అభిప్రాయాలు ఉంటాయి. అలాగే ఆహారం తీసుకొనే విషయంలో కూడా ఎవరికి వారు భిన్న రుచులను ఇష్టపడతారు. కొంతమంది వెజ్ భోజనం మాత్రమే తింటారు. మరికొందరు వెజ్, నాన్వెజ్ రెండింటిని లాగించేస్తారు. ఇంకొందిరికైతే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఇరాన్‌కు చెందిన ఓ వ్యక్తి గురించి వింటే షాకవ్వాల్సిందే. ఘోలంరేజా అనే 58 ఏళ్ల వ్యక్తి ఘన ఆహార పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేశాడు. అసలు మనుషులు తినే ఆహారాన్ని చూస్తేనే అతనికి విరక్తి కలుగుతుందట. అందుకే గత 17 సంవత్సరాలుగా కేవలం శీతల పానీయాలు మాత్రమే తాగి జీవనం సాగిస్తున్నాడు ఘోలంరేజా.

అయితే అతను ఆరప పదార్థాలు తినడాన్ని వదిలేయడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే 2006లో ఒకరోజు రాత్రి ఘోలంరేజా నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. తన గొంతులో వెంట్రుకల కట్ట ఇరుక్కొన్న భావన కలిగింది. దాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు వైద్యులను సంప్రదించిన అందరూ గొంతులో ఏమి లేదని చెప్పారు. ఇదే ఆలోచనలో పడ్డ ఘోలంరేజా చివరికి ఆహారం తినడం మానేశాడు. ఆహారానికి బదులు శీతల పానీయాలు తాగడం మొదలుపెట్టాడు. రోజూ ఈ పానియాలు తాగుతూ మూడు పెద్ద బాటిళ్లు ఖాళీ చేస్తున్నాడు. ఇలా చేయడంతో ఇప్పటివరకు 32 కిలోల బరువు తగ్గిపోయాడు. అతను తరతూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నా ఆరోగ్యం మాత్రం సాధారణంగానే ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి