ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి ఇదేనేమో.. వీడియో వైరల్‌

మామూలుగా ఎదురుగా టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడే ఒక్కోసారి పిల్లలు నిద్రను కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. తూగుతూ, తుళ్లుతూ

ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి ఇదేనేమో.. వీడియో వైరల్‌

Edited By:

Updated on: Sep 20, 2020 | 3:42 PM

kid viral video: మామూలుగా ఎదురుగా టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడే ఒక్కోసారి పిల్లలు నిద్రను కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. తూగుతూ, తుళ్లుతూ, మధ్యమధ్యలో కళ్లు తెరుస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలో గతంలో చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టోనీ బేకర్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఓ చిన్నారి నిద్రపోతుంటుంది. ఓ వ్యక్తి ఎదురుగా ఏవో విషయాలు చెబుతుంటారు. ఆ పాప నిద్రపోతుందని గమనించి లేపుతాడు. వెంటనే లేచి కళ్లు తెరిచి అతడివైపు చూసి నవ్వి మళ్లీ నిద్ర పోతుంది. ఇలా రిపీటెడ్‌కి జరుగుతుంటుంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. ఆన్‌లైన్‌ క్లాసుల్లో పిల్లల పరిస్థితి ఇదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More:

తిరుమల కొండపై విమానం చక్కర్లు.. స్పందించిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌

బాలీవుడ్‌లో మళ్లీ ‘మీటూ’.. తాప్సీపై విమర్శల వెల్లువ