Viral Video: హనుమయ్యకు నమస్కరించి మరీ నిలువునా దోచుకున్న దొంగలు..

|

Aug 27, 2024 | 3:56 PM

ఎలాంటి పనీ పాటు లేకుండా.. లగ్జరీగా కూర్చుని తినడానికి చాలా మంది ఇప్పుడున్న కాలంలో అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దొంగతనాలు అనేవి విపరీతంగా ఎక్కువై పోయాయి. నిజానికి దొంగతనం చేసిన తర్వాత ఎలాగైనా పట్టుబడుతున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ముందు గుర్తించక లేకపోతున్నారు. ఏ పనీ చేయకుండా కూర్చొని తినడానికి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు ఎంతకైనా..

Viral Video: హనుమయ్యకు నమస్కరించి మరీ నిలువునా దోచుకున్న దొంగలు..
Viral Video
Follow us on

ఎలాంటి పనీ పాటు లేకుండా.. లగ్జరీగా కూర్చుని తినడానికి చాలా మంది ఇప్పుడున్న కాలంలో అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దొంగతనాలు అనేవి విపరీతంగా ఎక్కువై పోయాయి. నిజానికి దొంగతనం చేసిన తర్వాత ఎలాగైనా పట్టుబడుతున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ముందు గుర్తించక లేకపోతున్నారు. ఏ పనీ చేయకుండా కూర్చొని తినడానికి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ గుడిలోని హనుమంతుడిని నిలువునా దోచుకున్నారు. ఆంజనేయ స్వామకి అలంకరించిన వెండి, బంగారు నగలను అపహరించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుందన్న విషయం కూడా వారికి తెలుసు. అయినా కూడా ఎలాంటి భయం లేకుండా ఈ ఘటనకు పాల్పడ్డారు. మరి ఈ వీడియో ఇప్పుడు చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలోని టెక్రీ హనుమాన్ గుడిలో ఇది జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఏంటంటే.. ముందుగా గుడిలోని నగలను, వస్తువులను దోచుకెళ్లడానికి వచ్చిన దుండగులు.. రెండు చేతులతో స్వామికి నమస్కరించి ఆ తర్వాత దొంగతనానికి పాల్పడ్డారు. ఇది చూస్తే ఖచ్చితంగా నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. హనుమంతుడికి అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలు, వస్తువులను అపహరించారు. ఈ వీడియోలో ఇద్దరు దొంగలు కనిపిస్తారు. కానీ ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది.

కానీ అంత ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా గుడిలోని ఆభరణాలు దోచుకెళ్లారంటే వాళ్లకు ఎంత ధైర్యం. అది కూడా చాలా సేపు వారు అక్కడే ఉన్నారు. కానీ ఇదంతా ఎవరూ గమనించ లేదు. అనంతరం ఆ తర్వాత గుడికి వచ్చిన పంతులు గారు గుర్తించి.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అంత సేపు దొంగలు గుడిలో ఉంటే.. ఏం చేస్తున్నారు?’.. ‘దేవుడికి నమస్కారం పెట్టి దర్జాగా నగలు దోచుకెళ్లారు’.. ‘ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా’.. అంటూ రకరకాల ఎమోజీలను కూడా పెడుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..