Viral: పూజారి ఇంటి ముందు గుర్తు తెలియని గోనె సంచి.. అందులో ఏముందో చూసి కళ్లు తేలేశాడు..

|

May 18, 2022 | 8:00 AM

ఇదెక్కడా చూడని వింత.. ఇదెక్కడా వినని వార్త.. దేవుడి కోపమొస్తే.. ఇలానే ఉంటుందేమో అనుకునేలా జరిగిన ఈ ఘటన ఏంటో చూసేద్దాం..

Viral: పూజారి ఇంటి ముందు గుర్తు తెలియని గోనె సంచి.. అందులో ఏముందో చూసి కళ్లు తేలేశాడు..
Temple
Follow us on

‘దేవుడు ఉన్నాడు’ అని అనడానికి ఈ ఘటన ఓ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఉన్న బాలాజీ ఆలయంలో సుమారు 16 విలువైన అష్టధాతు విగ్రహాలను దొంగలు దొంగలించారు. ఇక ఆ దొంగలించిన వాటిని 14 విగ్రహాలను.. వాళ్లు సరిగ్గా 5 రోజుల్లో తిరిగి పూజారి ఇంటి దగ్గర ఓ గోనె సంచిలో పెట్టి వదిలేయడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ఇదంతా దేవుడి మహిమో’ లేక ‘దేవుడి మీద భయమో’ తెలియదు గానీ.. దొంగాలిచిన విగ్రహాలు తిరిగి దొరకడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా తరౌన్హా ప్రాంతంలో ఉన్న పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 9వ తేదీన 16 అష్టధాతు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి.. ఆ గుడి పూజారి మహంత్ రాంబాలక్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే అనూహ్యంగా అయిదు రోజుల తర్వాత దొంగలించబడిన వాటిల్లోని 14 విగ్రహాలు పూజారి మహంత్ రాంబాలక్ ఇంటి ముందు ఓ గుర్తు తెలియని గోనె సంచిలో ప్రత్యక్షమయ్యాయి. అందులో అతడికి ఓ లేఖ కూడా దొరికింది. ‘దొంగలించిన దగ్గర నుంచి రాత్రిపూట ఎన్నో భయంకరమైన పీడ కలలు వచ్చాయని.. భయపడి తిరిగి విగ్రహాలను తీసుకొచ్చామని’ అందులో దొంగలు పేర్కొన్నారు. కాగా, దొరికిన 14 ‘అష్టధాతు’ విగ్రహాలను ఆలయ సిబ్బంది నిక్షిప్తం చేయగా.. మిగిలిన వాటి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.