Vira Video: గుమ్మంలోని గడపకు చెదలు పట్టాయని క్లీన్ చేస్తున్నారు.. లోపల నుంచి ఒక్కసారిగా..

|

Apr 15, 2023 | 11:59 AM

చెదపురుగులు కనిపించడంతో గడపను శుభ్రం చేయాలని భావించారు. కానీ లోపల ఇలా పాములు ఉంటాయని వారు ఊహించలేదు. అన్ని పాము పిల్లలు అక్కడికి చేరాయి..? వాటి తల్లి ఎక్కడుంది అన్నది అంతుబట్టడం లేదు.

Vira Video: గుమ్మంలోని గడపకు చెదలు పట్టాయని క్లీన్ చేస్తున్నారు.. లోపల నుంచి ఒక్కసారిగా..
Snakes
Follow us on

మహారాష్ట్రలోని గోండియాలోని ఒక ఇంటిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి  ఇంటి దర్వాజాకు చెదలు పట్టాయని భావించి.. క్లీన్ చేయించాలనుకున్నాడు. అందుకోసం ఓ మనిషిని పురమాయించాడు. అతడు పనిలో నిమగ్నమయ్యాడు. ఇక్కడే అనుకోని సంఘటన వెలుగుచూసింది. ఆ డోర్ ఫ్రేమ్‌లో ఉన్నవి చెదలు కాదు పాములు. అవునండీ బాబు. అది ఒకటి.. రెండు కాదు ఏకంగా 39 పాములు. దీంతో వెంటనే  ఇంటి యజమాని స్నేక్ క్యాచర్స్‌కు కాల్ చేశాడు. ఇద్దరు స్నేక్ క్యాచర్స్‌కు ఆ పాములు పట్టేందుకు దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది.

ఇంటి యజమాని సీతారామశర్మ మాట్లాడుతూ.. ఇంటిని 20 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలిపారు. తలుపు ఫ్రేమ్‌ను చెదపురుగులు తినేశాయని భావించినట్లు అతడు వివరించాడు. గత వారం, ఓ పనిమనిషిని పెట్టగా.. తను గడపను శుభ్రం చేస్తున్నప్పుడు, ఒక చిన్న పామును పట్టుకుందని.. మరికొన్ని లోపల కదలాడటం గమనించిందని చెప్పాడు. కానీ ఇలా పదులు సంఖ్యలో పాములు లోపల ఉంటాయని తాను ఊహించలేదన్నాడు. పట్టకారు సాయంతో పాములను పట్టి వాటిని ప్లాస్టిక్ జార్‌లో ఉంచారు స్నేక్ క్యాచర్స్. ఆపై వాటిని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇంట్లో దొరికిన పాములు విషపూరితమైనవి కావని స్నేక్ క్యాచర్ బంటి శర్మ తెలిపాడు. డోర్ ఫ్రేమ్‌లోని చెదపురుగులను పాములు ఆహారంగా తీసుకుంటున్నాయని అతడు వివరించాడు. పాములు వారం రోజుల క్రితమే పుట్టాయని, అవన్నీ కూడా 7 అంగుళాల కంటే తక్కువ పొడవు ఉన్నాయని వివరించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..