చదువు కోసమో.. పని కోసమో.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మనకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే.. వారి దగ్గర ఉండి పనులు చూసుకుంటాం. కానీ అలాంటి సౌకర్యాలు లేని వాళ్లు హాస్టల్స్, పీజీలలో జాయిన్ అవుతుంటారు. ముఖ్యంగా స్టుడెంట్స్ ఎక్కువగా హాస్టల్స్ లో ఉంటుంటారు. ఇక.. హాస్టల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా.. అమ్మ చేతి వంట తిందామా..అని ఎదురు చూస్తుంటారు హాస్టల్స్ లో ఉండేవారు. ఎందుకంటే ఎక్కువ మంది హాస్టల్ నిర్వహకులు ఖర్చులను వీలైనంత తగ్గించుకునేందుకు నాసిరకమైన భోజనాలు పెడుతుంటారు. దీంతో అవి రుచీ పచీ లేకపోవడమే కాకుండా.. ఆరోగ్యానికీ హాని కలిగిస్తుంది. అయితే.. హాస్టల్‌లో ఎలాంటి భోజనం పెడతారో చెబుతూ సాక్షి జైన్ అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
హాస్టల్‌లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో యువతికి పరోటా ఇచ్చారు. ఆమె.. తినేందుకు ప్రయత్నిస్తే అది విరగలేదు. కనీసం చెక్క బెంచీకి కొట్టినా శబ్దం వస్తుందే తప్ప అది ముక్కలవడం లేదు. ఈ మొత్తం తతంగాన్నంతా ఆమె వీడియో తీశారు. టేబుల్‌కు కొట్టినా ఇది విరగడం లేదు.. దీన్ని ఎలా తినాలి. హాస్టల్ నిర్వాహకులు ఇలాంటి భోజనాలు పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.
Hostel ka khana? pic.twitter.com/8FiLCwtZ33
— Sakshi Jain • Content Strategist (@thecontentedge) February 16, 2023
వీడియో.. కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ‘పరోటాలో ఐరన్ ఎక్కువగా ఉందేమో.. అందుకే విరగడం లేదు. సుత్తితో కొట్టండి’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తుండటం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..