Viral Video: వామ్మో.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. రెండు ముక్కలైన ట్రాక్టర్ ఇంజిన్.. షాకింగ్ వీడియో..

|

May 10, 2022 | 9:28 AM

మన దేశంలో సంవత్సరానికి 4.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. 1.5 లక్షల మంది మరణిస్తున్నట్లు నివేదికలు

Viral Video: వామ్మో.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. రెండు ముక్కలైన ట్రాక్టర్ ఇంజిన్.. షాకింగ్ వీడియో..
Viral
Follow us on

మన దేశంలో అత్యథిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. (Viral Video) రోజుకు పదుల సంఖ్యలో యాక్సిడెంట్స్ అవుతుండగా… కనీసం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి చేరుకునే వరకు నమ్మకంగా లేని పరిస్థితులు చూస్తు్న్నాం.. చిన్న చిన్న పొరపాట్లు.. అతి జాగ్రత్తలు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన రోజుకూ వేలాది మంది బలవుతున్నారు. మన దేశంలో సంవత్సరానికి 4.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. 1.5 లక్షల మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయంపై ఎన్సీఆర్బీ గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలపై నివేదిక విడుదల చేసింది. 2020 ఏడాదిలో రోడ్డు ప్రమాదాలలో 1.20 లక్షల మంది మరణించారు. కేవలం వాహనాలపై వెళ్లే వారు మాత్రమే కాదు.. కాలినడకన రోడ్డు పక్కన వెళ్లేవారికి కూడా కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే కొన్నిసార్లు పెను ప్రమాదం నుంచి క్షణాల్లో బయటపడిన సందర్భాలున్నాయి. రెప్పపాటులో జరిగే ప్రమాదం నుంచి దేవుడా అంటూ ప్రాణాలు రక్షించుకున్న వారున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అందులో కొన్ని యాక్సిడెంట్స్ మరింత భయంకరంగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‏గా ఉంటాయి. ఇటీవల ఓ తల్లి తన బిడ్డను ట్రక్కు కింద చాకచక్యంగా కాపాడుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ రెండు ముక్కలయ్యింది. చదును చేయని రోడ్డుపై నుంచి ఓ ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పైకీ వస్తుంది. ఇంతలో వెనక నుంచి వస్తోన్న ఓ కారు వేగంగా వచ్చి.. ట్రాక్టర్‏ను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ రెండుముక్కలయ్యింది. అదృష్టవశాత్తు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలతో తృటిలో తప్పించుకున్నాడు. లేకుంటే అతని ప్రాణాలు పోయిండేవి. డ్రైవర్ మాత్రమే కాకుండా.. ట్రాక్టర్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ప్రమాదం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట