Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఒక అమ్మాయి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. అయితే ఆ మేకను తాడుతో కట్టేసి ఉంచుతారు. దీంతో ఆ యువతి ధైర్యంగా కింద కూర్చొని మేకతో సెల్ఫీ దిగడానికి ట్రై చేయడం మనం గమనించవచ్చు. కానీ ఆ మేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్క దగ్గర ఉండదు. దీంత సెల్‌ఫోన్ కెమెరా సరిచేస్తూ ఉండగా ఆ మేక హఠాత్తుగా వచ్చి తన తలతో ఆ యువతి తలను బలంగా ఢీ కొడుతుంది. దీంతో ఆ యువతి అరుస్తూ కిందపడిపోతుంది. ఒక్కసారిగా ఆ యువతికి ఏం జరిగిందో అర్థంకాదు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కామెంట్స్, షేర్లు చేస్తున్నారు. కొంతమంది ఆ అమ్మాయి మేకను గమనించాల్సిందని చెబుతున్నారు. మరికొంతమంది మేక బలంగా పొడిచింది పాపం అంటు కామెంట్ చేశారు. ఇంకొందరు ఈ సెల్ఫీ పిచ్చి ఏంటని ఎగతాళి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆ యువతి ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే బాగుండనేది నెటిజన్ల అభిప్రాయం.
— The Darwin Awards (@AwardsDarwin_) September 1, 2021