Watch: ఒక్కసారిగా కుప్పకూలిన వందేళ్ల నాటి పురాతన బిల్డింగ్.. షాకింగ్‌ వీడియో వైరల్..

|

Mar 23, 2025 | 9:00 PM

పట్టణంలోని వందేళ్ల నాటి పాత భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇల్లు కూలిపోయే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. భవనం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు ఇద్దరు వ్యక్తులు ఆ భవనం గుండా వెళుతున్నట్లు ఫుటేజ్‌లో కనిపిస్తుంది.. ఆ సమయంలో

Watch: ఒక్కసారిగా కుప్పకూలిన వందేళ్ల నాటి పురాతన బిల్డింగ్.. షాకింగ్‌ వీడియో వైరల్..
Building Collapsed
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని థానా సౌత్ ప్రాంతంలో పాత శిథిలావస్థలో ఉన్న భవనం ముందు భాగం కూలిపోయింది. పట్టణంలోని వందేళ్ల నాటి పాత భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇల్లు కూలిపోయే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాదంలో ఒక కుక్క చనిపోగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ భవనం చోటా చౌరాహా దూద్ వాలి గాలి వద్ద ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నగర ఎమ్మెల్యే మనీష్ అసిజా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ బృందాన్ని కూడా పిలిపించారు. ఆ భవనంలో అద్దెకు నివసిస్తున్న ఒక మహిళ తృటిలో తప్పించుకుంది.

ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. భవనం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు ఇద్దరు వ్యక్తులు ఆ భవనం గుండా వెళుతున్నట్లు ఫుటేజ్‌లో కనిపిస్తుంది.. ఆ సమయంలో భవనం కూలి ఉంటే, అతను ప్రాణాలు కోల్పోయేవాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ భవనంలో 16 మంది వాటాదారులు ఉన్నారని, వీరంతా బయట ఉన్న సమయంలోనే ప్రమాదం జరిగినట్టుగా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. భవనం కూలిపోవడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..