Cold Coffee: కోల్డ్ కాఫీతో మ్యాగీ ఏంట్రా బాబూ.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో..

ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ కు కొదవే లేదు. ఏ ఏరియాలో చూసినా బండ్లపై అమ్మే ఫుడ్ వెరైటీస్ రా రమ్మని ఊరిస్తుంటాయి. చాట్, ఫ్రైస్, స్పైసెస్, ఫాస్ట్ ఫుడ్.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అంతే కాకుండా ఫుడ్..

Cold Coffee: కోల్డ్ కాఫీతో మ్యాగీ ఏంట్రా బాబూ.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో..
Cold Coffee Recipe

Updated on: Oct 09, 2022 | 8:08 PM

ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ కు కొదవే లేదు. ఏ ఏరియాలో చూసినా బండ్లపై అమ్మే ఫుడ్ వెరైటీస్ రా రమ్మని ఊరిస్తుంటాయి. చాట్, ఫ్రైస్, స్పైసెస్, ఫాస్ట్ ఫుడ్.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అంతే కాకుండా ఫుడ్ లో రకరకాలుగా చేయడం ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది. వంట చేసే వాళ్లల్లో ఉండే క్రియేటివీ మొత్తాన్ని రంగరించి ఒక సరికొత్త వంటకాన్ని కస్టమర్స్ ముందు ఉంచుతాయి. అయితే ఇది అన్ని సార్లు సక్సెస్ కాకపోవచ్చు. బెడిసి కొట్టవచ్చు కూడా. చాలా మంది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మ్యాగీని ఇష్టంగా తింటుంటారు. దానితో చేసే ఏ ఐటమ్ అయినా ఆవూరావురంటూ లాగించేస్తుంటారు. అయితే ప్రస్తుతం మ్యాగీతో ఓ వ్యక్తి చేసిన వంట చూస్తే మీకు కోపం నషాళానికంటుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సాధారణంగా ఆహారం మన మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. రుచికరమైన ఆహారం మానసిక స్థితిని చక్కగా మారుస్తుంది. అంతే గానీ వెరైటీ కోసం ఆహారంలో మార్పులు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఏదైనా వంటకంతో చేసిన ప్రయోగం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇటీవలి కాలంలో అలాంటిదే ఒక ఫుడ్ ఐటమ్ వైరల్ అవుతోంది. మ్యాగీ అనేది ప్రపంచంలోని అన్ని వయసుల వారు ఇష్టపడే వంటకం. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే ఆహార పదార్థాలలో ఒకటిగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వీడియో చూస్తే మీకు మ్యాగీ తినాలనే కోరిక కలగకుండా పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కోల్డ్ కాఫీతో మ్యాగీ చేశారు. వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది వందశాతం నిజం. ఈ వీడియోలో ఒక వ్యక్తి మొదట పాన్‌లో ఒక కప్పు కోల్డ్ కాఫీ పోయడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత మ్యాగీ నూడుల్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొత్తిమీర, టేస్ట్‌ మేకర్‌ను అందులో వేశాడు. చివరగా దానిపై కొంచెం కాఫీ పౌడర్‌పై పోశాడు. చూడడానికి చాలా వింతగా ఉంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. ఇప్పటివరకు వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇలా చేస్తే గరుడ పురాణంలో ప్రత్యేక శిక్షలు ఉంటాయిని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి