Trending Video: పైత్యం ముదిరితే ఎవరూ ఏం చేయలేరు. ఎవరైనా సరే చేసిన అతికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా మరీ. ఈ మధ్య కొంతమంది యువతీ యువకుల వెర్రివేషాలు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా మాయలో పడి పిచ్చివాళ్లు అయిపోతున్నారు. ఎక్కడ.. ఏం చేస్తున్నాం అన్న సోయి కూడా మర్చిపోతున్నారు. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్(himachal pradesh)లోని సోలన్ జిల్లా(Solan District)లో కొందరు యువకులు అలాంటి పిచ్చి పనే చేశారు. నడిరోడ్డుపైనే కారు డోర్ తెరిచి ఫీట్లు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటునుంచి వచ్చే కార్లోని వ్యక్తి సడెన్ బ్రేక్ వేశాడు సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ ప్రమాదంలో విన్యాసాలు చేసిన కార్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతి చేసిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల తిక్క పనిని వెనక వస్తున్న మరో కారు డ్రైవర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.