పెళ్లి అంటేనే చాలా స్పెషల్. దంపతులకు లైఫ్ లాంగ్ దాచుకునే గొప్ప మెమరీ. బంధువులు, స్నేహితుల మధ్య జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించడం చాలా బెస్ట్ మూమెంట్. అందుకే పెళ్లి రోజు జ్ఞాపకాలను అందరూ క్యాప్చూర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తమ వధువును తీసుకెళ్లడానికి ఫ్యాన్సీ కార్లలో వస్తారు. కొంతమంది అలంకరించబడిన రథాలపై తీసుకెళ్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా తారసపడుతుంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో ట్రెండ్ అవుతోంది. సదరు వీడియోలో వరుడు.. వధువును తీసుకెళ్లేందుకు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చాడు. అతడి రాయల్ ఎంట్రీకి అక్కడ ఉన్నవారందరూ ఫిదా అయ్యారు. వధువును కింగ్ స్టైల్లో ట్రాక్టర్‌పై వచ్చి తీసుకెళ్లాడు.
వరుడు తన శ్రీమతిని తీసుకెళ్లడానికి పూలు, బెలూన్లతో అలంకరించబడిన ట్రాక్టర్‌పై రావడం వీడియోలో మీరు చూడవచ్చు. వరుడి శైలి, స్టైల్ చూసి బంధువులందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. సూట్‌లో వచ్చిన వరుడు వధువు తన వద్దకు రాగానే, ఆమెను ట్రాక్టర్ ఎక్కించేందుకు చేయి చాచాడు. వధువు అతడి చేయి పట్టుకుని ట్రాక్టర్‌పైకి ఎక్కింది. వరుడి ఈ క్రేజీ ఎంట్రీని సోషల్ మీడియాలో ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. వరుడు వ్యవసాయంపైనే కాకుండా అతని ట్రాక్టర్‌పై కూడా చాలా ప్రేమతో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే తన పెళ్లికి సంబంధించిన ప్రత్యేక సందర్భంలో, అతడు ట్రాక్టర్‌పై వచ్చాడు.
Also Read: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే