Viral Video: వామ్మో.! నీటిలో జరజరా ఈదుతున్న భారీ పాము.. వీడియో చూస్తే గుండె గుభేల్

ఈ వైరల్ వీడియో చూస్తే దెబ్బకు దడుసుకుంటారు. ఎవరైనా చూస్తే వణికిపోతారు. రోడ్డుపై నడుము లోతున్న నీటిలో ఓ పెద్ద పాము నెమ్మదిగా ఈదుతూ జరజరా వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral Video: వామ్మో.! నీటిలో జరజరా ఈదుతున్న భారీ పాము.. వీడియో చూస్తే గుండె గుభేల్
Snake

Updated on: Nov 28, 2025 | 1:06 PM

దక్షిణ థాయిలాండ్‌లో వరదలు అన్నింటినీ నాశనం చేశాయి. కానీ ఇప్పుడు నీటిలో ఓ పాము జరజరా ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాదాపుగా రోడ్డుపై నడుము లోతున్న ఆ నీటిలో ఓ భారీ సైజ్ పాము నెమ్మదిగా ఈదుకుంటూ వెళ్తోంది. జనావాసాల్లో నీటి మట్టం పెరగడం వల్ల సరీసృపాలు తన ఆవాసాలను విడిచిపెట్టి.. ఇలా నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ముందు వరదలు.. ఆ తర్వాత ఈ భారీ సైజ్ పాము.. అక్కడున్నవారి జీవితాలను నరకంగా మార్చాయి’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు థాయిలాండ్ కోసం ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నాడు. అక్కడ హాట్ యాయ్, సాంగ్ఖ్లా లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తడం.. వరదలు వచ్చాయి. రోడ్లపై భారీ నీరు చేరుకుంది. వేలాది మంది ప్రజలు ఇంటి పైకప్పుపై చిక్కుకుపోయారు.

ఇంతలో, రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పడవలు, ట్రక్కులను ఉపయోగించి చిక్కుకున్న ప్రజలను కాపాడుతున్నాయి. సగం మునిగిపోయిన వాహనాలు, బలమైన అలల మధ్య చిక్కుకున్న కుటుంబాల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరదల దారుణ పరిస్థితిని వివరిస్తుంది. రాబోయే కొద్దిరోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండి ఇళ్లలోనే ఉండాలని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అధికారులు సూచించారు.