Viral Video: బసవన్నకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కేక్ కటింగ్, బంతి భోజనం.. మామూలుగా లేదుగా..

బసవన్న (ఎద్దు).. వ్యవసాయం చేసే రైతుకు చేదోడు.. ఆరుగాలం యజమానికి అండగా ఉండే ఈ మూగ జీవికి.. రైతు కుటుంబానికి విడదీయరాని బంధం.. వ్యవసాయం చేసే ఇంట ఉండే.. ఎద్దు రైతు కుటుంబానికి పంచ ప్రాణంలా మారుతుంది.. కుటుంబంలో ఒకటిగా ఏళ్ల తరబడి బంధం ఏర్పరచుకున్న ఎద్దును.. రైతు పూజించడం.. దాన్ని ఆప్యాయంగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

Viral Video: బసవన్నకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కేక్ కటింగ్, బంతి భోజనం.. మామూలుగా లేదుగా..
Bull Birthday Celebration

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 23, 2025 | 1:44 PM

బసవన్న (ఎద్దు).. వ్యవసాయం చేసే రైతుకు చేదోడు.. ఆరుగాలం యజమానికి అండగా ఉండే ఈ మూగ జీవికి.. రైతు కుటుంబానికి విడదీయరాని బంధం.. వ్యవసాయం చేసే ఇంట ఉండే.. ఎద్దు రైతు కుటుంబానికి పంచ ప్రాణంలా మారుతుంది.. కుటుంబంలో ఒకటిగా ఏళ్ల తరబడి బంధం ఏర్పరచుకున్న ఎద్దును.. రైతు పూజించడం.. దాన్ని ఆప్యాయంగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలా రైతు కుటుంబానికి ఆసరాగా ఉండే ఎద్దు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కోసారి ఈ మూగజీవులు రైతుల ప్రాణాలను కూడా కాపాడతాయి.. యజమాని.. ఎద్దుల మధ్య అంతగా విడదీయరాని బంధం ఏర్పడుంది.. అలా ఎద్దుతో తమకున్న ప్రాధాన్యతను చాటి చెబుతూ మమకారాన్ని ప్రదర్శించారు ఓ గ్రామస్థులు.. తమిళనాడులోని ఓ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎద్దుకు బర్త్ డే వేడుక నిర్వహించారు.. క్రిష్ణగిరి జిల్లాలో జరిగిన బసవన్న బర్త్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి..

కేలమంగళం సమీపంలోని దొడ్డ బేలూరులో బసవేశ్వర అనే ఎద్దు పుట్టినరోజును గ్రామస్థులు పండుగలా నిర్వహించారు. సంపంగి రామయ్య అనే రైతు ఇంట్లో 20 ఏళ్లుగా ఉన్న ఈ ఎద్దును బసవేశ్వరుడి రూపంగా కొలుస్తుంటారు.. దీంతో బుల్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఎద్దు బర్త్ డే వేడుకలకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీడియో చూడండి..

సమీపం గ్రామాల్లో జరిగే శుభకార్యాలు పండుగల్లో ఈ ఎద్దుకు ప్రత్యేక పూజలు చేయడం అనవాయితీగా వస్తోంది. ఇళ్లల్లో పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగితే ఈ ఎద్దును బసవేశ్వరుడిగా ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసే సాంప్రదాయం చుట్టుపక్కల గ్రామాల్లో ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎద్దుకు 20 ఏళ్ల వయస్సు పూర్తికావడంతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు జరిపారు. 20 కేజీల కేక్ కట్ చేసిన గ్రామస్తులు అందరికీ ప్రసాదంగా పంచారు. మేళతాళాలతో ఊరంతా ఊరేగించి సంబరాలు జరిపారు. ఎద్దు బర్త్ డే సందర్భంగా విందు భోజనం కూడా ఏర్పాటు చేసారు. ఇలా ఊరంతా కలిసి ఎద్దుకు పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహించి.. ఔరా అనిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..