
ప్రస్తుతమంతా ఆన్‌లైన్ షాపింగ్‌దే హవా నడుస్తోంది. హాయిగా ఇంట్లోనే కూర్చుని మనకు కావాల్సింది కొనేసుకోవచ్చు. డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత కిరాణా సామాగ్రి మొదలు, తినే ఆహారాలు, బట్టలు, బంగారం, వెండి వరకు ప్రతిదీ ఒకే క్లిక్‌తో ఆర్డర్ చేయవచ్చు. షాపుకు వెళ్లి కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. కానీ, కొన్నిసార్లు ఈ సౌలభ్యం సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. పెట్టే ఆర్డర్ ఒకటైతే.. వచ్చే డెలివరీ ఇంకొకటి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుండి వెండి నాణేలను ఆర్డర్ చేసిన ఒక వ్యక్తికి మ్యాగీ, హల్దిరామ్ వంటి స్నాక్స్ వచ్చాయి.
వినీత్ అనే వ్యక్తి ఆన్‌లైన్ షాపింగ్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నాడు. స్విగ్గీ హర్రర్ స్టోరీ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశాడు. తాను 999 నాణ్యత గల వెండి కాయిన్స్ ఆర్డర్ చేశానని, కానీ, నాకు మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. అంతే కాదు.. నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది. దానికి సీల్ చేసి ఉంది. డెలివరీ బాయ్ ఆ సీల్ ఓపెన్ చేయలేనని చెప్పాడు.. మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి.. అంటూ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. 40 నిమిషాల తరువాత నేను పౌచ్ ఓపెన్ చేసాను. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. కానీ, అవి 999 ప్యూర్ సిల్వర్ కాదు. అవి 925 స్టెర్లింగ్ సిల్వర్ అంటూ వినీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Swiggy Horror story … ‼️
Ordered silver coins, got Maggi and Haldiram packets.
There is one pouch in entire order which is sealed. Delivery guy told we can’t open it, either I take entire order or cancel it
Spent 40mins with customer care, opened and had to take the order… pic.twitter.com/yN79rFyr3x
— Vineeth K (@DealsDhamaka) September 27, 2025
ఇక ఆర్డర్ చూసిన కంగుతిన్న వినీత్.. తనకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్‌నే తీసుకోమని చెప్పాడట. తాను వాటిని ఆర్డర్ చేయలేదు. కాబట్టి, అవి నాకు వద్దని వినీత్ ఆ డెలివరీ బాయ్‌ని తిరిగి తీసుకెళ్లమని చెప్పాడట. ఇకపోతే, వినీత్ చేసిన ఈ పోస్ట్ మాత్రం నెట్టింట తీవ్ర సంచలనం రేపింది. పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే వేగంగా వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు. తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. కాగా, దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది. అతడికి న్యాయం చేసింది.
Order ID – 217928273626584
— Vineeth K (@DealsDhamaka) September 27, 2025
ఈ మేరకు వినీత్ మరో ట్వీట్ చేస్తూ.. ఈ సారి స్విగ్గీ తనకు స్వచ్ఛమైన వెండి నాణేలను డెలివరీ చేసిందని చెబుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు.. ఆర్డర్ ఐడీని షేర్ చేయమని స్విగ్గీ కోరింది. వినీత్ తన ఆర్డర్ ఐడీ షేర్ చేశారు. సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు.. కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారుకు ధన్యవాదాలు తెలిపింది. దీంతో కథ సుఖాంతం అయింది. అయితే, ఈ పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను ఎందుకు ఆర్డర్ చేస్తారని ప్రశ్నించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..