ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. కనిపించింది చూసి ఆశ్చర్యపోయింది..

|

Apr 26, 2024 | 5:30 PM

ఓ యువతి తన ఇంటి నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టే సమయంలో ఆమె డెలివరీ బాయ్‌ను ఓ ఫేవర్ అడిగింది. దానికి అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటికి ఫుడ్ పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఇక ఆవురావురుమంటూ పార్శిల్ ఓపెన్ చేసిన ఆమె.. అందులో..

ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. కనిపించింది చూసి ఆశ్చర్యపోయింది..
Food Parcel
Follow us on

ఓ యువతి తన ఇంటి నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టే సమయంలో ఆమె డెలివరీ బాయ్‌ను ఓ ఫేవర్ అడిగింది. దానికి అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటికి ఫుడ్ పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఇక ఆవురావురుమంటూ పార్శిల్ ఓపెన్ చేసిన ఆమె.. అందులో కనిపించిన వస్తువు చూసి తెగ ఆశ్చర్యపోయింది. తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

వివరాల్లోకెళ్తే.. ఆ సమయంలో రాంచీకి చెందిన నందిత అనే యువతి తీవ్రమైన తిమ్మిర్లతో బాధపడుతోంది. తన ఇంటి పక్కనే ఉన్న మెడికల్ స్టోర్‌కి కూడా నడవలేని పరిస్థితి. ఈ తరుణంలో ఆమె స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టి.. డెలివరీ ఏజెంట్‌ను తనకు మెడిసిన్ తీసుకురావాలని కోరింది. అతడు రిప్లయ్ ఏమి ఇచ్చాడో తెలియదు గానీ.. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఫుడ్ పార్శిల్ వచ్చింది. ఆమె దాన్ని తెరిచి చూడగా.. ఫుడ్‌తో పాటు తిమ్మిర్లను నయం చేసే ‘మెఫ్తల్ స్పాస్’ అనే మాత్రలు ఉన్నాయి. డెలివరీ ఏజెంట్ తనపై చూపించిన అభిమానానికి నందిత ఫిదా అయిపోయింది. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న ఆ వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తుతూ.. ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. కాగా, ఈ పోస్టు క్షణాల్లో వైరల్ కాగా.. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ఆ డెలివరీ బాయ్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.