Viral: తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి యువకుడు… సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్..

|

Jan 29, 2023 | 10:19 AM

విపరీతమైన కడుపునొప్పి, వికారం, వాంతులతో 34 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. అతడికి వెంటనే సీటీ స్కాన్‌ తీసిన వైద్యులు.. రిపోర్ట్ చూసి షాక్‌కు గురయ్యారు.

Viral: తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి యువకుడు... సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్..
Condom Wrapped Banana
Follow us on

అతడి వయస్సు 34 ఏళ్లు. బాధితుడి తాలూకా వివరాలు బహిర్గతం చేయకూడదు కాబట్టి చెప్పడం లేదు. అతను తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతున్నాడు. ఫుడ్ తినలేకపోతున్నాడు. కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడు కనీసం నిలబడలేకపోవడం కూడా చూసి.. సమస్య ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్లు వెంటనే టెస్టులు ప్రారంభించారు. ఈ క్రమంలో సీటీ స్కాన్‌లో.. షాకింగ్ విషయం రివీల్ అయ్యింది. అతడి కడుపులో కండోమ్‌తో చుట్టబడిన అరటిపండు ఉంది. దాని కారణంగానే అతడికి ఈ సమస్యలు వచ్చాయి. రోగి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, అతని శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింది. ఈ రెండు సమస్యల కారణంగా ఆ యువకుడు ఈ పని చేసినట్లు కనుగొన్నారు.

యువకుడి పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స దాన్ని బయటకు తీశారు. అనంతరం అతడి కడుపు నుంచి బయటకు తీసిన..  కండోమ్‌తో చుట్టుబడిన అరటిపండు చిత్రాలను షేర్ చేశారు. ఆపరేషన్ అనంతరం 3 రోజుల తర్వాత బాధితుడ్ని డిశ్చార్జ్ చేశారు.  కానీ ఆ వ్యక్తి ఇప్పటికీ తినడానికి, మలవిసర్జన చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. రోగి సాధారణ జీవితం గడపడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కండోమ్‌లో అరటిపండు పెట్టి మింగిన కేసు ఇదే తొలిసారి అని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను “క్యూరిస్” జర్నల్‌లో ప్రచురించారు. 

మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు.. మత్తుపదార్థాలను కండోమ్‌లో నింపి కడుపులో దాచిన సందర్భాలు చూశాం కానీ.. ఇలా మింగిన ఘటన ఇప్పటివరకు చూడలేదని వైద్యులు తెలిపారు.

 

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.