Viral Video: గణేష్ ఉత్సవాల్లో మితిమీరిన అతి.. నిప్పుతో చెలగాటం.. చివరకు..

|

Sep 02, 2022 | 1:05 PM

గణపతికి స్వాగతం చెప్పే సమయంలో ఓ యువకుడు... నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్ని మీద వెదజల్లే స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నం ఆ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది.

Viral Video: గణేష్ ఉత్సవాల్లో మితిమీరిన అతి.. నిప్పుతో చెలగాటం.. చివరకు..
Viral Video
Follow us on

Viral Video: అతి ఎప్పుడు ఏ విషయంలోనైనా అనర్ధమే అన్నారు పెద్దలు అందుకు సజీవ సాక్ష్యాలుగా అనేక సంఘటనలు మన కళ్ల ముందు నిలుస్తున్నాయి. తాజాగా గణపతి మండపంలో గణేశుడిని స్వాగతించడానికి సంఘం సభ్యులు పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు  ఆనందంగా నృత్యం చేశారు. వారిలో కొందరు భిన్నంగా గణపతికి స్వాగతం చెప్పడానికి రెడీ అయ్యారు. యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా  కనిపించారు. అయితే గణపతికి స్వాగతం చెప్పే సమయంలో ఓ యువకుడు… నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్ని మీద వెదజల్లే స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నం ఆ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది.

 

ఇవి కూడా చదవండి

 

మనిషి మంటలనుఊడడం కోసం తన నోటి నుండి మండే పదార్థాన్ని ఉమ్మివేసాడు.. అయితే అది మిస్ ఫైర్ అయ్యి.. చివరకి ఆ యువకుడి ప్రాణాల మీదకు వచ్చింది. అతని శరీరం మీదకు వ్యాపించాయి మంటలు. దీంతో చుట్టూ ఉన్న వ్యక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. చూస్తుండగానే ఆ యువకుడి శరీరంలోని పైభాగం మొత్తం మంటల్లో చిక్కుకుంది. అయితే, మరొక వ్యక్తి వెంటనే స్పందించాడు. అతనిని రక్షించడానికి వచ్చి మంటలను అదుపు చేయడం కోసం ఆ వ్యక్తి టీ-షర్టును త్వరగా శరీరం నుంచి తీసి.. మంటలు వ్యాపించకుండా చేశాడు. దీంతో ఆ యువకుడు అదృష్టవశాత్తూ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.

ఈ ఘటన ” గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో చోటు చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..