Viral Video: వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు..వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే.!

|

Oct 22, 2024 | 8:24 AM

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి పెద్ద అపార్టమెంట్‌ కిందికి దూకుతుండగా స్థానికులు కాపాడే ప్రయత్నిం చేశారు. చివరికి ఏం జరిగింది? వాళ్లు అతని కాపాడారా? లేదో మీరే చూడండి.

Viral Video: వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు..వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే.!
Suicide Attempt
Follow us on

స్థానికులు సమయానుకూలంగా స్పందించడం వల్ల ప్రమాదం జరగకుండా నిరోధించవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఆ వ్యక్తి భవనంలోని బాల్కనీలో వేలాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. సొసైటీలో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని, దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న సంగతిని గమినించిన స్థానికులు అతని ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేశారు. చివరికి ఏం అయిందో మీరే చూడండి..

ఓ పెద్ద అపార్టమెంట్‌లో ఓ వ్యక్తి కిందికి దూకే ప్రయత్నం చేశాడు. అది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి పైకి లాగారు. అతను అనుకోకుండా కిందికి జారిపోయాడో, లేక కావాలనే సుసైడ్ చేసుకోవాలని ప్రయత్నించి మధ్యలో భయం వేసిందో తెలీదు గానీ కొంచెం ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి. అయితే ఈ దృశ్యాలను ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. భయ్యా.. ఆత్మహత్యాయత్నం చేసుకోవాలంటే ఇలాంటి ప్లాన్‌లు వేసుకోవద్దని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు కిందపడి ఉంటే.. చింతపండు అయితుండే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..