భారతదేశం (India) ఎన్నో రకాల సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు. దేశ సంపదగా విరాజిల్లుతున్న పురాణాలు, ఇతిహాసాలు గురించి చాలా మందికి తెలియదు. వాటి గురించి కనీస అవగాహన కూడా లేదన్నది అంగీకరించలేని వాస్తవం. కానీ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరోవైపు.. భారతదేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఇద్దరు స్కూల్ విద్యార్ధులు రామాయణ, మహాభారతాన్ని కంఠతా పట్టేసినట్టున్నారు.. ఏ ఫర్ యాపిల్ అనాల్సిన వయసులో ఇతిహాసాల్లోని ప్రశ్నలకు టకటకా సమాధానాలిచ్చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టూడెంట్స్ ట్యాలెంట్ చూసి ఫిదా అవుతున్నారా.. ఈ వీడియోను ‘బ్యోమకేశ్’ అనే యూజర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు.
ये कौन सा स्कूल है भाई यार , इधर ही एडमिशन कराओ बच्चों का ?? pic.twitter.com/yFNpnVqBys
ఇవి కూడా చదవండి— Byomkesh (@byomkesbakshy) July 24, 2022
ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులను చాలా కష్టమైన ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నలకు వారు ఏమాత్రం తొణకకుండా టకటకా సమాధానాలు చెప్పేశారు. మొదటి విద్యార్థి పాండవ సోదరులు, ద్రోణాచార్య కుమారుడు, అర్జునుడి గురువు, మహాభారతానికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇంకో విద్యార్థిని రామాయణం గురించి ప్రశ్నలు అడిగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ చిన్నారుల ప్రతిభను మెచ్చుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. అంతే కాకుండా పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్చాలని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.