కుక్కంటేనే విశ్వాసం..తాను చనిపోయి..జీవాలకు ప్రాణం పోసి

|

Jun 30, 2019 | 12:04 AM

కుక్క విశ్వాసానికి చిరునామా! ఆ విషయం మరోసారి నిజం మైంది. 100 సంఖ్యలో ఉన్న మేకలు, గొర్రెల ప్రాణాలు కాపాడేందుకు తాను ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం  మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయ్యవారిపల్లి పంచాయతీ చిలుకానగర్‌ కాలనీలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ మేకలను పెంచుకొని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నలుగురు కాపర్లు మేకల మందను తోల్కోని భైరవుని కొండ ప్రాంతం వైపు కదిలారు. మార్గమధ్యలోని తిప్పల […]

కుక్కంటేనే విశ్వాసం..తాను చనిపోయి..జీవాలకు ప్రాణం పోసి
Follow us on

కుక్క విశ్వాసానికి చిరునామా! ఆ విషయం మరోసారి నిజం మైంది. 100 సంఖ్యలో ఉన్న మేకలు, గొర్రెల ప్రాణాలు కాపాడేందుకు తాను ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం అయ్యవారిపల్లిలో శుక్రవారం  మధ్యాహ్నం చోటుచేసుకుంది.

అయ్యవారిపల్లి పంచాయతీ చిలుకానగర్‌ కాలనీలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ మేకలను పెంచుకొని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నలుగురు కాపర్లు మేకల మందను తోల్కోని భైరవుని కొండ ప్రాంతం వైపు కదిలారు. మార్గమధ్యలోని తిప్పల సమీపానికి చేరుకోగానే మేకలన్నీ మేత కోసం పరుగులు తీశాయి. వాటి కాపర్లు మాటల్లో పడి నెమ్మదిగా వస్తూ వెనుకబడి పోయారు.

ఇంతలో ఓ వీధి కుక్క అడ్డుగా..అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. తమపై దాడి చేస్తుందేమోనని కాపర్లు భయపడ్డారు. కుక్కను తరమడానికి ముందుకు కదిలారు. మేకల మంద ముందుకు వెళ్లి చూడగా.. అక్కడ ఓ మేక విగతజీవిగా పడి ఉంది. ఆ పక్కనే కరెంట్ స్తంభం నుంచి తెగిపడి వేలాడుతున్న ఓ వైరు ఉంది. అప్పటిగానీ ఆ గొర్రెల కాపర్లకు అసలు విషయం అర్థం కాలేదు.

తెగి పడిన కరెంట్ తీగలో విద్యుత్ ప్రసారం అవుతున్న విషయాన్ని గమనించిన గొర్రెల కాపర్లు.. గుంపుగా అటువైపు దూసుకొస్తున్న తమ మేకలను వెనక్కి తరిమారు.  కానీ, మేకలను కాపాడే యత్నంలో ప్రమాదవశాత్తూ కరెంట్ తీగకు తగిలి చూస్తుండగానే ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఆ దృశ్యం చూసి గొర్రెల కాపర్ల గుండె చెరువైంది. ఈ విషయం ఈ నోటా ఆ నోటా నలిగి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.