అర్ధరాత్రి దాటింది. బస్సు గమ్యస్థానానికి చేరుకుంటోంది. సరిగ్గా మార్గం మధ్యకు వచ్చింది. ఓ మలుపు తిరిగే సమయంలో దూరం నుంచి బస్సు లైట్ వెలుతురులో ఓ నల్లటి ఆకారం కనిపించింది. అదేమో రోడ్డు పక్కన ఉంది. డ్రైవర్‌కు అనుమానమొచ్చింది. ఏమై ఉంటుందనుకుంటూ.. దాని దగ్గరకు వెళ్లగానే బస్సు ఆపాడు. దిగి చెక్ చేయగా.. దెబ్బకు ఖంగుతిన్నాడు. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రంలోని రేవారీ జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై ఓ ప్రైవేటు బస్సు అర్ధరాత్రి వేళ వెళ్తుండగా.. గర్హి అలవల్‌పూర్ గ్రామ సమీపంలో ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు రోడ్డు పక్కన ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఏంటా అని బస్సు ఆపి చూడగా.. అక్కడ మహిళ మృతదేహం పడి ఉంది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మహిళ ముఖంపై గాయాలు, మెడకు చున్నీ కట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె మెదడు చుట్టూ చున్నీ కట్టి ఉండటంతో.. ఎవరైనా ఈ మహిళ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లకు సదరు మహిళ ఫోటోను పంపించారు.